కరోనాను జయించిన 99 ఏళ్ల భామ
కరోనా మహమ్మారి ధాటికి ఆరోగ్యంగా ఉన్నవారు సైతం కదేలవుతున్నారు. అయితే, హైదరాబాద్ నగరానికి చెందిన ఓ భామ కొవిడ్ మహమ్మరిని జయించింది.
కరోనా మహమ్మారి ధాటికి ఆరోగ్యంగా ఉన్నవారు సైతం కదేలవుతున్నారు. అయితే, హైదరాబాద్ నగరానికి చెందిన ఓ భామ కొవిడ్ మహమ్మరిని జయించింది. మధుమేహం, హైపర్‌టెన్షన్‌తో పాటు కరోనా సోకి తీవ్ర అస్వస్థతకు గురైన 99 ఏళ్ల మహిళకు, ఆమె కొడుకు 65 ఏళ్ల వ్యక్తి పూర్తిగా కోలుకున్నారు. కాగా, చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆమె 100వ పుట్టినరోజని తెలుసుకుని ఆస్పత్రిలోనే వేడుక చేశారు.
15 రోజులుగా జ్వరం, కిడ్నీ సమస్యతోపాటు శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఓ వృద్ధ మహిళ హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరారు. అంతేకాదు ఆమెకు మధుమేహం, హైపర్‌టెన్షన్‌తోపాటు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. వృద్ధురాలు వయస్సు 99 కావడంతో ఆమెను ఐసీయూలో ప్రత్యేకంగా ఉంచి వైద్యులు చికిత్సను అందించారు. అదే సమయంలో ఆమె కుమారుడు 65 ఏళ్ల వ్యక్తికి కూడా కొవిడ్ సోకి ఆస్పత్రిలో చేరారు. ఈయన కూడా గుండె సమస్యతో పాటు మధుమేహంతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఇద్దరిని వేరు వేరుగా ఉంచిన వైద్య సిబ్బంది చికిత్స అందించారు.
శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయనకు ఆక్సిజన్ అందించారు. యాంటీవైరల్స్, స్టెరాయిడ్స్ ఇవ్వడంతో పాటు ప్లాస్మా థెరపీ కూడా అందించారు. ఇద్దరు ఎప్పటికప్పడు పరీక్షలు నిర్వహిస్తూ వారికి ధైర్యాని నూరిపోశారు. దీంతో ఇద్దరు కరోనాను పూర్తిగా జయించి కోలుకున్నారు. పూర్తిగా కోలుకున్న అనంతరం వారిని డిశ్చార్జి చేశారు అపోలో సిబ్బంది. కరోనాను జయించగలనన్న ఆమె ఆత్మవిశ్వాసం, డాక్టర్ల కృషితో 99 ఏళ్ల వయసులోనూ బామ్మగారు కొవిడ్‌ను ఓడించారు.