గుడ్ న్యూస్.. ఎయిడ్స్ మందులతో కరోనా నయం.. సీఎం కంగ్రాట్స్..

|

Mar 16, 2020 | 2:12 PM

COVID 19: ప్రపంచమొత్తాన్ని కరోనా వైరస్ గజగజలాడిస్తోంది. ఈ కోవిడ్ 19 ఇండియాలో కూడా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే బాధితుల సంఖ్య 110కి చేరుకుంది. ఈ తరుణంలో కరోనా వైరస్ నివారణకు సంబంధించిన ఓ విషయం గురించి ఆసక్తికరమైన అంశం బయటికి వచ్చింది. అంతేకాకుండా అది గుడ్ న్యూస్ కావడం విశేషం. జైపూర్‌లోని సవై మాన్‌సింగ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నలుగురు కరోనా పేషంట్లలో ముగ్గురు కోలుకున్నారు. ఇక వాళ్లకు మలేరియా, స్వైన్ ఫ్లూ, హెచ్‌ఐవీ మందుల […]

గుడ్ న్యూస్.. ఎయిడ్స్ మందులతో కరోనా నయం.. సీఎం కంగ్రాట్స్..
Follow us on

COVID 19: ప్రపంచమొత్తాన్ని కరోనా వైరస్ గజగజలాడిస్తోంది. ఈ కోవిడ్ 19 ఇండియాలో కూడా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే బాధితుల సంఖ్య 110కి చేరుకుంది. ఈ తరుణంలో కరోనా వైరస్ నివారణకు సంబంధించిన ఓ విషయం గురించి ఆసక్తికరమైన అంశం బయటికి వచ్చింది. అంతేకాకుండా అది గుడ్ న్యూస్ కావడం విశేషం.

జైపూర్‌లోని సవై మాన్‌సింగ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నలుగురు కరోనా పేషంట్లలో ముగ్గురు కోలుకున్నారు. ఇక వాళ్లకు మలేరియా, స్వైన్ ఫ్లూ, హెచ్‌ఐవీ మందుల కాంబినేషన్‌లోని డ్రగ్స్ ఇచ్చినట్లు అక్కడి వైద్యులు చెబుతున్నారు. ఇటలీకి చెందిన ఆండ్రీ కార్లి, అతడి భార్య ఇటీవల 23 మంది టూరిస్టులతో కలిసి జైపూర్‌కు విచ్చేశారు. ఇక్కడికి వచ్చిన మొదట్లో వారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. తాజాగా ఆ మూడు కలయికలోని మందులు చికిత్సలో ఉపయోగించడం వల్ల టెస్టులు నెగటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక వీరితో పాటు దుబాయ్ నుంచి జైపూర్ వచ్చిన మరో వ్యక్తికి కూడా నెగటివ్ వచ్చింది.

మరోవైపు ఆసుపత్రి వైద్యులు ఆ ముగ్గురు నెగటివ్ వచ్చిన పేషెంట్లను రూహ్స్ హాస్పిటల్‌కు తరలించారు. ఇక ఈ విషయంపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. డాక్టర్లకు అభినందనలు తెలుపుతూ.. వారు చేసిన సేవలను మెచ్చుకున్నారు. కాగా, స్పెయిన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి మాత్రం పాజిటివ్ నిర్ధారణ అయింది. అతడ్ని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

కరోనా వైరస్ వ్యాక్సిన్ కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎయిడ్స్ వ్యాధికి వాడే మందులు వేసుకోవడం వల్ల ఇద్దరు వ్యక్తులు కరోనా నుంచి బయటపడ్డారు. ఇటలీ నుంచి జైపూర్‌కు వచ్చిన ఒక జంటకు కరోనా సోకడంతో గత కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా వారికి టెస్ట్ చేయగా కరోనా నెగటివ్ అని తేలింది. యాంటీ హెచ్‌ఐవీ మందులు వాడటం వల్లే కరోనా తగ్గిందని వైద్యులు చెబుతున్నారు.

For More News:

ఉగ్రవాదులకు భయాన్ని పరిచయం చేసిన కరోనా.. ఆ పనులకు ఫుల్‌‌స్టాప్..

కొత్త జంటలకు విలన్‌గా కరోనా.. భారీగా నమోదైన విడాకుల కేసులు..

ఐపీఎల్ నిర్వహణకు మరో ఐదు తేదీలు..?

రోజా ది గ్రేట్.. నాగబాబుకు మరోసారి షాక్..!

ఇండియాలో విజృంభిస్తున్న కరోనా.. దేశంలో నమోదైన కేసుల వివరాలు ఇవే..

Breaking: కరోనా ఎఫెక్ట్.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ 26 వరకు వాయిదా..

కరోనా టైమ్: శానిటైజర్ల, మాస్క్‌ల ధరలపై కేంద్రం సంచలన నిర్ణయం