ఫ్లాష్ న్యూస్: కరోనా ప్రభావం.. జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా..

|

Mar 19, 2020 | 11:46 AM

COVID 19: దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈతో సహా దేశవ్యాప్తంగా జరుగుతోన్న అన్ని బోర్డు పరీక్షలను మార్చి 31 వరకు వాయిదా వేయాలని కోరింది. దీనిపై విద్యార్థులకు ఎలాంటి ఆందోళనలు లేకుండా హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేసి సమాచారాన్ని అందించాలని విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలోనే సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19 నుంచి 31 వరకు జరగాల్సిన టెన్త్, […]

ఫ్లాష్ న్యూస్: కరోనా ప్రభావం.. జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా..
Follow us on

COVID 19: దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈతో సహా దేశవ్యాప్తంగా జరుగుతోన్న అన్ని బోర్డు పరీక్షలను మార్చి 31 వరకు వాయిదా వేయాలని కోరింది. దీనిపై విద్యార్థులకు ఎలాంటి ఆందోళనలు లేకుండా హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేసి సమాచారాన్ని అందించాలని విజ్ఞప్తి చేసింది.

ఈ క్రమంలోనే సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19 నుంచి 31 వరకు జరగాల్సిన టెన్త్, ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు బోర్డు కార్యదర్శి ప్రకటించారు. మార్చి 31 తర్వాత కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తామని చెప్పారు. అలాగే జేఈఈ మెయిన్స్ పరీక్షలను సైతం వాయిదా వేశారు. ఏప్రిల్ 5 నుంచి నాలుగు రోజుల పాటు జరగాల్సిన ఈ ఎగ్జామ్స్‌ను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ పరీక్షలకు కొత్త తేదీలను మార్చి 31 తర్వాత ప్రకటిస్తామని నిట్ తెలిపింది. కాగా, కరోనా ప్రభావంతో యూజీసీతో సహా పలు పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే.ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 166కు చేరుకుంది.

For More News:

కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే

కరోనా ఎఫెక్ట్.. రసికప్రియులకు గుడ్ న్యూస్…