ఏపీలో 13కి చేరిన కరోనా కేసులు..

ఏపీలో ఈ రోజు రెండు క‌రోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఏపీ ప్ర‌భుత్వం రిలీజ్ చేసిన తాజా హెల్త్ బులెటిన్ లో ఈ విష‌యాన్ని పొందుపరిచారు. విశాఖకు చెందిన వ్యక్తి కరోనాకు చికిత్స పొందుతోన్నాడు. అత‌డి బంధువుకు కూడా కోవిడ్ ఉంద‌ని ఉద‌యం నిర్దార‌ణ అయ్యింది. గుంటూరుకు చెందిన మరో రోగి బంధువుకు కూడా కోవిడ్ పాజిటివ్​గా తేలింది. దీంతో ఆంధ్ర‌ప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 13కు చేరుకున్నాయి. రాష్ట్రంలో మొత్తం 406 శాంపిళ్లను […]

ఏపీలో 13కి చేరిన కరోనా కేసులు..

Updated on: Mar 27, 2020 | 10:06 PM

ఏపీలో ఈ రోజు రెండు క‌రోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఏపీ ప్ర‌భుత్వం రిలీజ్ చేసిన తాజా హెల్త్ బులెటిన్ లో ఈ విష‌యాన్ని పొందుపరిచారు. విశాఖకు చెందిన వ్యక్తి కరోనాకు చికిత్స పొందుతోన్నాడు. అత‌డి బంధువుకు కూడా కోవిడ్ ఉంద‌ని ఉద‌యం నిర్దార‌ణ అయ్యింది. గుంటూరుకు చెందిన మరో రోగి బంధువుకు కూడా కోవిడ్ పాజిటివ్​గా తేలింది. దీంతో ఆంధ్ర‌ప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 13కు చేరుకున్నాయి. రాష్ట్రంలో మొత్తం 406 శాంపిళ్లను టెస్టుల‌కు పంపించ‌గా..368 మందికి నెగిటివ్ అని తేలింది. మరో 25 మందికి సంబంధించిన టెస్టుల‌కు సంబంధించిన ఫ‌లితాలు వెల్లడి కావాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.