రాబర్ట్ వాద్రా బెయిల్‌ పొడిగింపు

న్యూడిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ, ప్రియాంక వాద్రా భర్త రాబర్ట్‌ వాద్రాకు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ గడువును మార్చి 25 వరకూ పొడిగిస్తూ డిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. వాద్రాతో పాటు ఆయన సన్నిహితుడు మనోజ్ అరోరా తాత్కాలిక బెయిల్‌ను మార్చి 2 వరకు పొడిగిస్తున్నట్టు ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్ కుమార్ ప్రకటించారు. లండన్‌లో ఉన్న 1.9 మిలియన్‌ పౌండ్ల విలువచేసే స్థిరాస్తి కొనుగోలు విషయంలో వాద్రా మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ఆయనపై ఎన్‌ఫోర్స్ […]

రాబర్ట్ వాద్రా బెయిల్‌ పొడిగింపు
Follow us

|

Updated on: Mar 19, 2019 | 7:12 PM

న్యూడిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ, ప్రియాంక వాద్రా భర్త రాబర్ట్‌ వాద్రాకు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ గడువును మార్చి 25 వరకూ పొడిగిస్తూ డిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. వాద్రాతో పాటు ఆయన సన్నిహితుడు మనోజ్ అరోరా తాత్కాలిక బెయిల్‌ను మార్చి 2 వరకు పొడిగిస్తున్నట్టు ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్ కుమార్ ప్రకటించారు. లండన్‌లో ఉన్న 1.9 మిలియన్‌ పౌండ్ల విలువచేసే స్థిరాస్తి కొనుగోలు విషయంలో వాద్రా మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ఆయనపై ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్‌ ఆరోపణలు చేసింది.

ఆ సమయంలో అతను కోర్టును ఆశ్రయించగా, అతణ్ని అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఆ బెయిల్‌ గడువు నేటితో ముగియనున్న తరుణంలో వాద్రా మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈ ముందస్తు బెయిల్‌ గడువును మార్చి 25 వరకూ పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. ఇదే తరహాలో నాలుగు మిలియన్‌, ఐదు మిలియన్‌ పౌండ్ల విలువచేసే మరో రెండు ఇళ్ల కొనుగోలులోనూ ఆయన మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని, దానికి సంబంధించి ఆయనను అదుపులోకి తీసుకుని విచారించడానికి తమకు అనుమతివ్వాలని ఈడీ కోర్టుకు విన్నవించింది. ఈ నేపథ్యంలో ఈడీకి సహకరించాలని వాద్రాకు కోర్టు సూచించింది.

కాగా ఈడీ విచారణ తీరుపై రాబర్ట్‌ వాద్రా మండిపడ్డారు. విచారణకు సహకరిస్తున్నా అధికారులు తనను వేధిస్తున్నారన్నారు. రూ. 4.62 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్‌ వేదికగా ఈడీపై విమర్శల వర్షం కురిపించారు. ఈడీ ఆదేశించిన నాటి నుంచి తాను విచారణకు సహకరిస్తున్నానని, ఏమీ దాయ డం లేదని స్పష్టం చేశారు. 6 రోజుల నుంచి రోజూ 8 నుంచి 12 గంటల పాటు తనను విచారిస్తున్నారని తెలిపారు. లంచ్‌కు మాత్రమే 40 నిమిషాల విరా మం ఇచ్చేవారని చెప్పారు. వాష్‌రూమ్‌కు వెళ్లే సమయంలో కూడా తన వెంట అధికారులను పంపేవారని ఆరోపించారు.