Costly Umbrella: ఈ గొడుగు ధర అక్షరాల 1.27 లక్షలు.. కానీ వర్షంలో వాడకూడదు..

|

May 25, 2022 | 9:44 AM

ఎండా, వానల నుండి రక్షణగా ఉంటుందని మనం గొడుగును కొంటుంటాం. మార్కెట్లో గొడుగు ధర ఎంత ఉంటుంది? మహా అంటే 300 రూపాయలు చెల్లిస్తే మంచి గొడుగు వస్తుంది. అంతకన్నా మంచి గొడుగు కావాలంటే వెయ్యి రూపాయల వరకు ఖర్చు చేయొచ్చు. కానీ...

Costly Umbrella: ఈ గొడుగు ధర అక్షరాల 1.27 లక్షలు.. కానీ వర్షంలో వాడకూడదు..
Costly Umbrella Rs 1.27 Lakhs
Follow us on


ఎండా, వానల నుండి రక్షణగా ఉంటుందని మనం గొడుగును కొంటుంటాం. మార్కెట్లో గొడుగు ధర ఎంత ఉంటుంది? మహా అంటే 300 రూపాయలు చెల్లిస్తే మంచి గొడుగు వస్తుంది. అంతకన్నా మంచి గొడుగు కావాలంటే వెయ్యి రూపాయల వరకు ఖర్చు చేయొచ్చు. కానీ… గొడుగు కోసం లక్ష రూపాయలు ఖర్చు పెట్టేవారు ఉంటారా? ఓ కంపెనీ ఇంత ఖరీదైన గొడుగుల్ని తయారు చేసి అమ్ముతోంది.లగ్జరీ లేబుల్ బ్రాండ్ అయిన గూచీ, స్పోర్ట్స్‌వేర్ సంస్థ అయిన అడిడాస్ ఏజీ కలిసి ఓ గొడుగును తయారు చేశాయి. ఆ గొడుగు ధర ఎంతో తెలుసా? అక్షరాల 1,644 డాలర్లు. భారతీయ కరెన్సీ లెక్క ప్రకారం ఒక లక్ష 27 వేల రూపాయలు. ఈ గొడుగు ధర అందరూ షాకవుతున్నారు. గొడుగు కోసం ఇంత చెల్లించాలా అని అవాక్కవుతున్నారు. లైనిన్ కాటన్ బ్లెండ్ క్లాత్‌తో ఈ గొడుగును రూపొందించారు. ట్రిఫాయిల్ ప్రింట్ ఉండటం విశేషం. ఎండలో మాత్రమే వాడాల్సిన ఈ గొడుగు.. వర్షంలో వాడకూడదట. కనీసం వర్షంలో వాడలేని గొడుగు ధర ఇంతా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..