Coronavirus: దేశమంతా కరోనా వైరస్‌తో వణికిపోతుండగా వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వంతు సాయం చేయడానికి ముందుకు వచ్చింది. మాస్కుల ఉత్పత్తి సామర్ధ్యాన్ని రోజుకు లక్షకు పెంచడమే కాకుండా కరోనా పాజిటివ్ పేషంట్లను తరలించేందుకు ఉపయోగించే వాహనాలకు ఉచితంగా ఇంధనం సరఫరా చేస్తామని సంస్థ ప్రకటించింది. అటు లాక్ డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన పేదలకు ఎన్జీవోలతో కలిసి ఉచితంగా ఆహారం అందిస్తామని కూడా స్పష్టం చేసింది.
అలాగే దేశంలోనే మొట్టమొదటి కరోనా వైరస్ ఆసుపత్రిని ముంబైలో అతి తక్కువ వ్యవధిలోనే రిలయన్స్ సంస్థ నిర్మించింది. ఇందులో కోవిడ్ 19 బాధితుల కోసం ప్రత్యేకంగా 100 పడకలను సిద్దం చేశారు. ఈ ఆసుపత్రిని బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) సహకారంతో శ్రీ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ రెండు వారాల్లో నెలకొల్పింది. వెంటిలేటర్లు, పేస్‌మేకర్లు, డయాల్‌సిస్ మెషిన్లు, పేటెంట్ మానిటరింగ్ పరికరాలతో పాటుగా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేలా ఓ నెగటివ్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేసింది.
మరోవైపు కరోనా వైరస్ కారణంగా మూతపడిన కంపెనీలలో పాలు ప్రాజెక్ట్‌లలో పని చేసే కాంట్రాక్టు, తాత్కాలిక ఉద్యోగులకు జీతాలను పూర్తిగా చెల్లిస్తామని రిలయన్స్ సంస్థ వెల్లడించింది. అటు జియో పాత కస్టమర్లకు డేటా పరిమితిని పెంచుతున్నట్లు.. అంతేకాకుండా నూతన బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లకు ఉచితంగా సర్వీసులను అందించనున్నట్లు స్పష్టం చేసింది. జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్ కనెక్షన్ పొందడానికి రూ.2,500 చెల్లించాల్సి ఉండగా.. వీటిలో రూ.1,500 రిఫండ్ ఇవ్వనున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. కాగా, మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 112కి చేరుకుంది.
For More News:
కొత్తగూడెం పోలీస్ అధికారి, వంట మనిషికి కరోనా.. 39కి చేరిన కేసులు..
ఇండియా లాక్ డౌన్.. ఏ సేవలకు బ్రేక్.? ఏవి ఉంటాయి.?
‘ఇంటికి రావద్దు ప్లీజ్’.. కరోనా అనుమానితుల ఇళ్లకు రెడ్ నోటిసులు..
కరోనా మరణ మృదంగం.. ప్రపంచవ్యాప్తంగా 18 వేలు దాటిన మరణాలు..
కేటీఅర్ అన్నా.. మా ఊరికి పంపండి.. సోదరి విజ్ఞప్తి..
జక్కన్న అదిరిపోయే ఉగాది ట్రీట్.. ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ లోగో విడుదల..