ఏపీ: 7,855 పాజిటివ్ కేసులు, 52 మరణాలు..

|

Sep 24, 2020 | 6:34 PM

ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 76,000 శాంపిల్స్‌ను పరీక్షించగా 7,855 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఏపీ: 7,855 పాజిటివ్ కేసులు, 52 మరణాలు..
Follow us on

ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 76,000 శాంపిల్స్‌ను పరీక్షించగా 7,855 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,54,385కి చేరింది. ఇందులో 69,353 యాక్టివ్ కేసులు ఉండగా.. 5,79,474 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గడిచిన 24 గంటల్లో 52 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 5,558కు చేరుకుంది. నేటి వరకు రాష్ట్రంలో 53.78 లక్షల కరోనా టెస్టులు జరిగాయి. (Coronavirus Positive Cases)

నిన్న కోవిడ్ వల్ల చిత్తూరులో ఎనిమిది మంది మృతి చెందగా.. అనంతపురం, గుంటూరు జిల్లాల్లో ఆరుగురు చొప్పున మృతి చెందారు. అలాగే కృష్ణ, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరిలో నలుగురు.. కడప, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున.. విజయనగరంలో ఇద్దరు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 91 వేలు దాటగా.. చిత్తూరులో అత్యధికంగా 617 మంది కరోనాతో మరణించారు. (Coronavirus Positive Cases)

Also Read:

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. స్కూల్‌కు వెళ్లకుండానే పది పరీక్షలు.?

ఏపీ ప్రజలకు ఆర్టీసీ అలెర్ట్.. నిలబడి ప్రయాణించడానికి నో ఎంట్రీ..

విద్యార్ధులకు ముఖ్య గమనిక.. ఈ నెల 26న ఏపీ ఎంసెట్ ‘కీ’

కొంపముంచిన పానీపూరీ.. మహిళ మృతి..