ఏపీలో కరోనా ఉగ్రరూపం.. ఒక్క రోజులో 9544 కేసులు, 91 మరణాలు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9544 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,34,940కు చేరింది.

ఏపీలో కరోనా ఉగ్రరూపం.. ఒక్క రోజులో 9544 కేసులు, 91 మరణాలు..

Updated on: Aug 21, 2020 | 5:13 PM

Coronavirus Positive Cases Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9544 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,34,940కు చేరింది. ఇందులో 87803 యాక్టివ్ కేసులు ఉండగా.. 244045 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా 91 మంది వైరస్ కారణంగా మృతి చెందటంతో మొత్తం మృతుల సంఖ్య 3092కు చేరింది. అటు గడిచిన 24 గంటల్లో 8,827 మంది కరోనాను జయించారు.

ఇక జిల్లాల వారీగా చూస్తే.. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1312 కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత పశ్చిమ గోదావరిలో 1131, చిత్తూరులో 1103, కర్నూలులో 919 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు అనంతపురంలో 704, గుంటూరులో 358, కడపలో 343, కృష్ణాలో 265, నెల్లూరులో 761, ప్రకాశంలో 797, శ్రీకాకుళంలో 571, విశాఖపట్నం 738, విజయనగరంలో 542 కేసులు వచ్చాయి. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2461, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో 434 కేసులు నమోదయ్యాయి.

Also Read:

”భారత్‌లో డిసెంబర్ 3 నాటికి కరోనా అంతం”

కరోనా సోకినట్లయితే.. మొదటిగా కనిపించే లక్షణం ఇదే..!

కలియుగ కర్ణుడికి ఒక్క రోజే 31 వేల మెసేజ్‌లు..

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్..