Coronavirus Telangana: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 293 పాజిటివ్ కేసులు నమోదు..

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం పాజిటివ్ కేసుల సంఖ్య..

Coronavirus Telangana: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి..  కొత్తగా 293 పాజిటివ్ కేసులు నమోదు..

Edited By:

Updated on: Jan 02, 2021 | 3:52 PM

Corona Positive Cases Telangana : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం పాజిటివ్ కేసుల సంఖ్య కొద్దిగా తగ్గింది.  శనివారం ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 293 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 535 మంది కరోనా నుండి కోలుకుని ఆస్పత్రుల నుండి డిశ్చార్జి కాగా.. ఇద్దరు మృత్యువాత పడ్డారు.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,87,108కు చేరింది. వీరిలో 2,79,991 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,517 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 1546 మంది చనిపోయారు. ఇక రాష్ట్రంలో రికవరీ రేట్ 97.52 శాతంగా ఉంది. జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 72 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి.