AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COVID 19: భార్యకు కరోనా సోకిందని బాత్‌రూమ్‌లో లాక్ చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే.?

Coronavirus Outbreak: ప్రస్తుతం ప్రపంచదేశాలన్నింటినీ కరోనా వైరస్ మహమ్మారి భయబ్రాంతులకు గురి చేస్తోంది. చైనాలోని వుహాన్‌లో పుట్టి పెరిగిన ఈ కొవిడ్ 19 వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే 80 దేశాలలో కరోనా తన పంజాను విసిరింది. దీని బారిన పడి వేలాది మంది మృతి చెందగా.. లక్షల్లో బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ ప్రభావంతో ఇప్పుడు షేక్‌హ్యాండ్స్ ఇచ్చుకున్నా.. దగ్గినా.. తుమ్మినా జనాలు ఏదో పెద్ద నేరంగా భావిస్తున్నారు. ప్రతీ దేశంలో కూడా […]

COVID 19: భార్యకు కరోనా సోకిందని బాత్‌రూమ్‌లో లాక్ చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే.?
Ravi Kiran
|

Updated on: Mar 05, 2020 | 2:39 PM

Share

Coronavirus Outbreak: ప్రస్తుతం ప్రపంచదేశాలన్నింటినీ కరోనా వైరస్ మహమ్మారి భయబ్రాంతులకు గురి చేస్తోంది. చైనాలోని వుహాన్‌లో పుట్టి పెరిగిన ఈ కొవిడ్ 19 వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే 80 దేశాలలో కరోనా తన పంజాను విసిరింది. దీని బారిన పడి వేలాది మంది మృతి చెందగా.. లక్షల్లో బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఈ వైరస్ ప్రభావంతో ఇప్పుడు షేక్‌హ్యాండ్స్ ఇచ్చుకున్నా.. దగ్గినా.. తుమ్మినా జనాలు ఏదో పెద్ద నేరంగా భావిస్తున్నారు. ప్రతీ దేశంలో కూడా అనుమానితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కరోనా ఎవరికి ఉంది.? ఎవరికి లేదు.? అనేది కూడా కనిపెట్టడం కష్టంగా మారింది. ఈ క్రమంలోనే లిథుయానియాలో ఓ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తన భార్యకు కరోనా వైరస్ సోకిందని అనుమానంతో శాడిస్ట్ భర్త ఆమెను బాత్‌రూమ్‌లో పెట్టి లాక్ చేశాడు. ఎంత చెప్పినా కూడా వినకుండా బయటికి రానివ్వకపోవడంతో ఆ అనుమానపు భర్త నిర్వాకాన్ని ఆమె ఎలాగోలా పోలీసులకు తెలియజేసింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆమెను బాత్రూం నుంచి బయటికి తీసుకొచ్చి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో కరోనా సోకలేదని నిర్ధారణ అయింది. ఇంతకీ ఆ భర్తగారికి తన భార్యకు కరోనా సోకిందని అనుమానం ఎప్పుడొచ్చిందంటే.. కరోనా ప్రభావం మొదలైన తర్వాత ఇటలీ నుంచి వచ్చిన ఓ వ్యక్తితో ఆమె మాట్లాడిందని తెలుసుకున్నాడు. ఇక ఆ తరుణంలోనే ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ తారాస్థాయికి చేరుకుంది. వెంటనే అతడిలో అనుమానాలు మొదలయ్యాయి. తన భార్యకు కరోనా సోకినట్లు డాక్టర్లకు చెప్పడమే కాకుండా ఆమె ఎక్కడికీ వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మెడికల్ టెస్టులు నిర్వహించాలని తెలిపాడు. ఇందులో భాగంగానే ఆమెను బాత్‌రూమ్‌లో పెట్టి లాక్ వేశాడు. కాగా, ఈ శాడిస్ట్ భర్త నిర్వాకం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

For More News: 

బిగ్‌బాస్ 3 విజేతపై బీరు సీసాలతో దాడి.. తలకు తీవ్ర గాయాలు..

కరోనా అలెర్ట్: ఇంటర్ విద్యార్థులకు కీలక సూచనలు.. మాస్కులతో పరీక్షలు..

నాలుగు రోజుల్లో అల్లకల్లోలం.. కరోనాను జయించిన కేరళ విద్యార్థిని మనోగతం..

కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పులు.?

టీ20 ప్రపంచకప్: తొలిసారి ఫైనల్‌కు చేరిన టీమిండియా

కీచక ఆటోడ్రైవర్‌ను పట్టించిన దిశ యాప్.. మహిళ సేఫ్..

ఆసుపత్రి నుంచి పారిపోయిన కరోనా పేషెంట్.. డాక్టర్లు పరేషాన్!

కేఎఫ్‌సీ చికెన్ కోసం కరోనా బాధితుల డిమాండ్..?

Follow Us
ప్రకృతి వైపరీత్యాలతో కారు దెబ్బతింటే ఇన్సూరెన్స్ వస్తుందా?
ప్రకృతి వైపరీత్యాలతో కారు దెబ్బతింటే ఇన్సూరెన్స్ వస్తుందా?
దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడనున్నాయా? అసలు కారణాలు ఇవే..!
దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడనున్నాయా? అసలు కారణాలు ఇవే..!
స్క్రిప్ట్‌లో అలాంటి సీన్స్ లేవు.. అయినా ఆ హీరో పదే పదే నన్ను..
స్క్రిప్ట్‌లో అలాంటి సీన్స్ లేవు.. అయినా ఆ హీరో పదే పదే నన్ను..
వీధి కుక్క నుంచి గ్లోబల్ స్టార్..పీస్ డాగ్ అలోకా స్ఫూర్తిదాయకం!
వీధి కుక్క నుంచి గ్లోబల్ స్టార్..పీస్ డాగ్ అలోకా స్ఫూర్తిదాయకం!
Video: ఎవర్రా నువ్వు.. ఇలా కూడా చేపలు పడతారా..
Video: ఎవర్రా నువ్వు.. ఇలా కూడా చేపలు పడతారా..
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
వన్డే టీమ్ నుంచి హార్ధిక్ పాండ్యా ఔట్!
వన్డే టీమ్ నుంచి హార్ధిక్ పాండ్యా ఔట్!
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. ఒక్కరోజే రూ. 4 వేలు తగ్గిన బంగారం..
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. ఒక్కరోజే రూ. 4 వేలు తగ్గిన బంగారం..