అమెరికా H1B వీసా జారీలో కొత్త షరతులు..!

|

May 23, 2020 | 6:43 PM

కరోనా వైరస్ దెబ్బకి అమెరికా విలవిలాడుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ స్థాయిలో దెబ్బ పడింది. దీంతో ఆ దేశంలో నిరుద్యోగిత రేటు భారీగా పెరిగిపోయింది. అమెరికా పౌరుల ఉద్యోగ అవకాశాలకు గండి పడకుండా అమెరికా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అమెరికా చట్ట సభల్లో కీలకమైన బిల్లును ప్రవేశపెట్టారు. హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసా జారీ విధానంలో కీలక సంస్కరణలను ప్రతిపాదిస్తూ రెండు ప్రధాన పార్టీలు రూపొందించిన బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ది హెచ్‌-1బీ అండ్‌ ఎల్‌-1 […]

అమెరికా H1B వీసా జారీలో కొత్త షరతులు..!
Follow us on

కరోనా వైరస్ దెబ్బకి అమెరికా విలవిలాడుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ స్థాయిలో దెబ్బ పడింది. దీంతో ఆ దేశంలో నిరుద్యోగిత రేటు భారీగా పెరిగిపోయింది. అమెరికా పౌరుల ఉద్యోగ అవకాశాలకు గండి పడకుండా అమెరికా దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
అమెరికా చట్ట సభల్లో కీలకమైన బిల్లును ప్రవేశపెట్టారు. హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసా జారీ విధానంలో కీలక సంస్కరణలను ప్రతిపాదిస్తూ రెండు ప్రధాన పార్టీలు రూపొందించిన బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ది హెచ్‌-1బీ అండ్‌ ఎల్‌-1 వీసా రిఫార్మ్‌ యాక్ట్‌ పేరిట చట్టసభల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే అమెరికాలో చదివిన విదేశీ నిపుణులకు తొలి ప్రాధాన్యం లభించేలా చూడటమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించారు. అమెరికా పౌరుల ఉపాధి కాపాడటం కూడా ఓ ఉద్దేశమని ఈ బిల్లులో పేర్కొన్నారు.
బిల్లులోని ముఖ్యాంశాలు..
* ఉన్నత విద్య, నైపుణ్యం కలిగి అమెరికాలో చదువుకున్న చురుకైన విద్యార్థులకు హెచ్‌-1బీ వీసా జారీలో తొలి ప్రాధాన్యం.
* అమెరికా ఉద్యోగుల స్థానాన్ని హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసాదారులను భర్తీ చేయడాన్ని పూర్తిగా నిషేధించాలి.
* ఈ వీసాదారుల వల్ల ఇతర అమెరికా ఉద్యోగులు, కార్మికుల పనితీరు, పని ప్రదేశంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూడాలి.
* తాత్కాలిక శిక్షణా ప్రయోజనాల కోసం పెద్ద సంఖ్యలో హెచ్‌-1బీ, ఎల్‌-1 ఉద్యోగులను దిగుమతి చేసుకుని తిరిగి వారిని సొంత దేశానికి పంపుతున్న అవుట్‌ సోర్సింగ్‌ కంపెనీలపై ఉక్కుపాదం మోపాలి.
* వీసా నిబంధనలు, ఉద్యోగుల నియామకాల విషయంలో నిబంధనలు అమలు చేసేలా లేబర్‌ డిపార్ట్‌మెంట్‌కు మరిన్ని అధికారాలను కట్టబెట్టడం.
* ఆయా కంపెనీలు హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసాదారుల సమగ్ర వివరాలు అందజేసేలా చూడాలి.
* నిబంధనల్ని ఉల్లంఘించినట్లు తేలితే శిక్షించే అధికారాన్ని కూడా బిల్లులో ప్రతిపాదించారు.
* కచ్చితమైన వేతన నిబంధన అమలు చేస్తే విదేశీ ఉద్యోగులను కంపెనీలు తెచ్చుకోవన్న ఉద్దేశంతో ఈ ప్రతిపాదన.

ఇక బిల్లు గనక ఆమోదం పొందితే హెచ్ 1బీ వీసాదారులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు.