ఐసిఎంఆర్ న‌యా టెస్టింగ్ స్ట్రాట‌జీ..!

|

Jun 19, 2020 | 3:00 PM

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) సోమవారం సవరించిన కోవిడ్-19 పరీక్షా వ్యూహాన్ని విడుదల చేసింది. ఇందులో అన్ని ర‌కాల వ్యాధి ల‌క్ష‌ణాలతో పాటు, అంతర్జాతీయ ప్రయాణం చేసిన‌వారి ప‌ట్ల ఎలాంటి ధోర‌ణితో ముందుకెళ్లాల‌నే విషయాల‌ను వివ‌రించింది. ముఖ్యంగా కోవిడ్-19పై పోరాటం చేస్తోన్న ఫ్రంట్ లైన్ వ‌ర్కర్లు, కంటైన్మెంట్ జోన్లో సేవ‌లందిస్తోన్న సిబ్బంది, వివిధ ఆస్ప‌త్రిలో సాధార‌ణ వైద్య సేవ‌లు అందుకోని ప్లూ ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతోన్న‌వారికి ముందుగా టెస్టులు చేయాల‌ని సూచించింది. వీరితో పాటు ఇత‌ర […]

ఐసిఎంఆర్ న‌యా టెస్టింగ్ స్ట్రాట‌జీ..!
Follow us on

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) సోమవారం సవరించిన కోవిడ్-19 పరీక్షా వ్యూహాన్ని విడుదల చేసింది. ఇందులో అన్ని ర‌కాల వ్యాధి ల‌క్ష‌ణాలతో పాటు, అంతర్జాతీయ ప్రయాణం చేసిన‌వారి ప‌ట్ల ఎలాంటి ధోర‌ణితో ముందుకెళ్లాల‌నే విషయాల‌ను వివ‌రించింది. ముఖ్యంగా కోవిడ్-19పై పోరాటం చేస్తోన్న ఫ్రంట్ లైన్ వ‌ర్కర్లు, కంటైన్మెంట్ జోన్లో సేవ‌లందిస్తోన్న సిబ్బంది, వివిధ ఆస్ప‌త్రిలో సాధార‌ణ వైద్య సేవ‌లు అందుకోని ప్లూ ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతోన్న‌వారికి ముందుగా టెస్టులు చేయాల‌ని సూచించింది. వీరితో పాటు ఇత‌ర ప్రాంతాల నుంచి తిరిగివ‌చ్చి అనారోగ్యంతో ఉన్న‌ వ‌ల‌స కార్మికులకు టెస్టుల విష‌యంలో ప్ర‌థ‌మ ప్రాథాన్య‌త ఇవ్వాల‌ని వెల్ల‌డించింది. విదేశాల నుంచి తిరిగివ‌చ్చి ల‌క్ష‌ణాలు క‌లిగిఉన్న‌వారికి 7 రోజుల్లోపే టెస్ట్ చేయాల‌ని తెలిపింది.

ఇక క‌రోనా పాజిటివ్ అని నిర్దార‌ణ అయిన వ్య‌క్తితో కాంటాక్ట్ అయిన‌వారిని క్వారంటైన్ లో ఉంచి.. 5వ రోజు, 10వ రోజు టెస్టులు చేయాలని పేర్కొంది. కొత్త మార్గదర్శకాలు ప్ర‌కారం అత్య‌వ‌స‌ర‌ వైద్య సేవ‌లు(డెలివరీల వంటి కేసుల‌లో) ఎటువంటి జాప్యం ఉండ‌కూడ‌ద‌ని హెచ్చరించింది. ఒక‌వేళ స‌ద‌రు వ్య‌క్తిలో ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే టెస్టింగ్ కి పంప‌వ‌చ్చిని ఐసిఎంఆర్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఏప్రిల్ 9 న జారీ చేసిన పాత‌ మార్గదర్శకాల ప్ర‌కారం రోగ లక్ష‌ణాలు ఆరోగ్య సంరక్షణ కార్మికులకు మాత్రమే పరీక్షల‌ను ఐసిఎంఆర్ క్లియర్ చేసింది. తాజా మార్గ‌నిర్దేశ‌కాల ప్ర‌కారం వలస కూలీలకు, విదేశాల నుండి తిరిగి భారతదేశానికి వ‌చ్చిన‌వారికి కూడా ప‌రీక్ష‌లు చేయాల‌ని చెప్పింది. కాగా ఇప్పటివరకు 23,02,792 నమూనాలను పరీక్షించినట్లు ఐసిఎంఆర్ ఒక ప్రకటనలో తెలిపింది.