వరుడికి కరోనా.. ఆగిన పెళ్లి..!

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో పెళ్లి జరుగుతుండగా సడెన్‌గా వచ్చిన పోలీసులు.. వివాహాన్ని ఆపేశారు. వరుడిని, అతని తండ్రిని ఆస్పత్రికి

వరుడికి కరోనా.. ఆగిన పెళ్లి..!

Edited By:

Updated on: Jun 22, 2020 | 6:35 PM

Coronavirus fear stops wedding: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో పెళ్లి జరుగుతుండగా సడెన్‌గా వచ్చిన పోలీసులు.. వివాహాన్ని ఆపేశారు. వరుడిని, అతని తండ్రిని ఆస్పత్రికి తరలించారు. వీరిద్దరికీ కరోనా పాజిటివ్ అని తేలడమే దీనికి కారణం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో జరిగింది.

ఢిల్లీ నుంచి జైన్ 15న వరుడి కుటుంబం అమేథీ వచ్చింది. వీళ్ల శాంపిల్స్ సేకరించిన అధికారులు.. టెస్టింగ్‌కు పంపారు. దీనికి సంబంధించిన ఫలితాలు పెళ్లి రోజునే వచ్చాయి. వీటిలో వరుడికి, అతని తండ్రికి కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో వాళ్లిద్దరినీ పోలీసులు ఆస్పత్రికి తరలించారు. పెళ్లికి హాజరైన 10 కుటుంబాలను క్వారంటైన్‌లో ఉంచారు.

Also Read: ప్రపంచానికే భారత్ ఓ గొప్ప ఔషధాలయం..!