AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పేలిన గ్యాస్ సిలిండర్.. ముగ్గురికి గాయాలు

పిండివంటలు చేస్తున్న ఓ ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ సంఘటనలో ముగ్గురు గాయపడ్డారు. రామ‌గుండం సింగ‌రేణి కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పేలిన గ్యాస్ సిలిండర్.. ముగ్గురికి గాయాలు
Balaraju Goud
|

Updated on: Jun 22, 2020 | 6:14 PM

Share

పిండివంటలు చేస్తున్న ఓ ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ సంఘటనలో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించి చికిత్సఅందిస్తున్నారు. రామ‌గుండం సింగ‌రేణి కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సింగరేణి సంస్థ రామగుండం రీజియన్-3 ఓ.సి.పి-1లో ఫిట్టర్ గా విధులు నిర్వహిస్తున్న పొన్నం రాజీ రెడ్డి టి2-80లో నివాసముంటున్నాడు. సోమవారం రాజిరెడ్డి భార్య సరోజిని ఇరుపొరుగు వారితో కలిసి ఇంట్లో పిండి వంటలు చేస్తున్నారు.ఈ క్రమంలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ నుండి గ్యాస్ లీకై మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో ఎగిసిపడిన మంటలు పరిసరాలకు వ్యాపించాయి. ఈ ఘటనలో రాజిరెడ్డి భార్య సరోజిని, కొడుకు శరత్ పాటు సరోజిని స్నేహితురాలు వనమలకు గాయాలయ్యాయి.

గ్యాస్ సిలిండర్ పేలుడుపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో సరోజిని, వనమలకు స్వల్ప గాయాలు కాగా శరత్‌కు తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను గోదావరి ఖని ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ పేలుడుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Follow Us
టీమిండియాకు మూడు అగ్నిపరీక్షలు.. కివీస్ గండాన్ని దాటుతుందా ?
టీమిండియాకు మూడు అగ్నిపరీక్షలు.. కివీస్ గండాన్ని దాటుతుందా ?
ఈసారి తెలుగు మాధ్యమంలో టెన్త్‌ పరీక్షలు రాసేది కేవలం 8.66 శాతమే!
ఈసారి తెలుగు మాధ్యమంలో టెన్త్‌ పరీక్షలు రాసేది కేవలం 8.66 శాతమే!
చెరువుల సుందరీకరణలో దూసుకెళ్తున్న హైడ్రా.. అందుబాటులోకి మరో రెండు
చెరువుల సుందరీకరణలో దూసుకెళ్తున్న హైడ్రా.. అందుబాటులోకి మరో రెండు
ఈ సింపుల్ ట్రిక్ తెలిస్తే చాలు.. 100 ఏళ్ల ఆయుష్షు మీ సొంతం!
ఈ సింపుల్ ట్రిక్ తెలిస్తే చాలు.. 100 ఏళ్ల ఆయుష్షు మీ సొంతం!
నిమ్మకాయలో ఉండే ఆ శక్తి ఏంటి?.. అమ్మవారికి ఎందుకు సమర్పిస్తారు?
నిమ్మకాయలో ఉండే ఆ శక్తి ఏంటి?.. అమ్మవారికి ఎందుకు సమర్పిస్తారు?
ఆదివారంనాడు కష్టాలు తెచ్చే ఈ పనులు అస్సలు చేయకూడదు..?
ఆదివారంనాడు కష్టాలు తెచ్చే ఈ పనులు అస్సలు చేయకూడదు..?
ఫైనల్‎లో టీమిండియాలోకి డేంజరస్ బౌలర్..ఇక ఊచకోతే
ఫైనల్‎లో టీమిండియాలోకి డేంజరస్ బౌలర్..ఇక ఊచకోతే
ఉమెన్స్‌ డే స్పెషల్‌.. 7 ప్రత్యేకమైన స్కీమ్స్‌!
ఉమెన్స్‌ డే స్పెషల్‌.. 7 ప్రత్యేకమైన స్కీమ్స్‌!
ఆదివారం మాంసాహారం ఎందుకు తినకూడదో తెలుసా..?
ఆదివారం మాంసాహారం ఎందుకు తినకూడదో తెలుసా..?
AP, తెలంగాణ తపాలా ఉద్యోగాలకు 2026 ఎంపికైన వారి జాబితా వచ్చేసింది
AP, తెలంగాణ తపాలా ఉద్యోగాలకు 2026 ఎంపికైన వారి జాబితా వచ్చేసింది