కరోనా ఎఫెక్ట్.. భారీగా దిగివస్తోన్న పెట్రోల్ ధరలు!
దేశ వ్యాప్తంగా ముడి చమురు ధరలు దిగి వస్తున్నాయి. అందులోనూ.. గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ వ్యాప్తితో.. ప్రపంచ దేశాలన్నీ గందరగోళంలో నెలకొన్నాయి. దీంతో.. ఈ ఎఫెక్ట్ కాస్తా.. రోజు పెట్రోల్ ధరలపై పడుతోంది. గత కొద్ది రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు దిగి వస్తోన్న సంగతి తెలిసిందే. తాజగా ఈ రోజు అన్ని ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్‌పై 23 పైసలు తగ్గగా.. ఏకంగా డీజిల్‌పై 85 పైసలు తగ్గింది. దీంతో ఇవాళ […]
దేశ వ్యాప్తంగా ముడి చమురు ధరలు దిగి వస్తున్నాయి. అందులోనూ.. గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ వ్యాప్తితో.. ప్రపంచ దేశాలన్నీ గందరగోళంలో నెలకొన్నాయి. దీంతో.. ఈ ఎఫెక్ట్ కాస్తా.. రోజు పెట్రోల్ ధరలపై పడుతోంది. గత కొద్ది రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు దిగి వస్తోన్న సంగతి తెలిసిందే.
తాజగా ఈ రోజు అన్ని ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్‌పై 23 పైసలు తగ్గగా.. ఏకంగా డీజిల్‌పై 85 పైసలు తగ్గింది. దీంతో ఇవాళ లీటర్ పెట్రోల్ ధర రూ.76.65 కాగా, డీజిల్ 70.91 రూపాయిలుగా ఉంది. ఈ ఏడాది మొదలు నుంచీ.. పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఏకంగా లీటర్‌పై 80 రూపాయిలకి పైగానే పెరిగింది. దీంతో వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఇక దేశ రాజధాని ఢిల్లీతో పాటు, ఏపీ వ్యాప్తంగా కూడా ముడిచమురు ధరలు తగ్గాయి. తాజాగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ ధర రూ.78.59 కాగా డీజిల్ ధర రూ. 68.01 పైసలుగా ఉంది. అలాగే ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 72.23లు కాగా, డీజిల్ రూ.65.23గా ఉంది. కాగా.. రెండు, మూడు రోజుల నుంచి అంతర్జాతీయంగా ముడిచమురుల ధరలపై ప్రభావం నెలకొనడంతో.. ధరలు తగ్గుముఖం పడుతున్నాయని.. మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
అందులోనూ.. కరోనా ఎఫెక్ట్ ప్రభావం కూడా స్టాక్ మార్కెట్‌లపై తీవ్రంగా చూపుతోంది. దీంతో ముడిచమురుల ధరలు తగ్గుతున్నాయి. దాదాపు ఈ రోజు లీటర్ పెట్రోల్ రేటు ప్రకారం జనవరి నుంచి ఫిబ్రవరి వరకూ రూ.4లు తగ్గింది.