కరోనా మృత్యుకేళి.. 22 వేలు దాటిన మరణాలు.. ఒక్కరోజే @748

Coronavirus Effect: చైనాలోని వుహన్‌లో మొదలైన ప్రాణాంతక కరోనా వైరస్ రోజురోజుకూ వేగంగా విస్తరిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి యావత్ ప్రపంచం అతలాకుతలం అవుతోంది. ఇదిలా ఉంటే ఈ వ్యాధి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 22 వేల మంది ప్రాణాలు విడిచారు. ఈ వైరస్ ప్రపంచం మొత్తంగా 4,88,055 మందికి సోకినట్లు నిర్ధారణ కాగా.. 1,17,582 మంది కోలుకున్నారు. కోవిడ్ 19 వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ప్రపంచదేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. సుమారు […]

కరోనా మృత్యుకేళి.. 22 వేలు దాటిన మరణాలు.. ఒక్కరోజే @748

Updated on: Mar 26, 2020 | 5:57 PM

Coronavirus Effect: చైనాలోని వుహన్‌లో మొదలైన ప్రాణాంతక కరోనా వైరస్ రోజురోజుకూ వేగంగా విస్తరిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి యావత్ ప్రపంచం అతలాకుతలం అవుతోంది. ఇదిలా ఉంటే ఈ వ్యాధి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 22 వేల మంది ప్రాణాలు విడిచారు. ఈ వైరస్ ప్రపంచం మొత్తంగా 4,88,055 మందికి సోకినట్లు నిర్ధారణ కాగా.. 1,17,582 మంది కోలుకున్నారు. కోవిడ్ 19 వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ప్రపంచదేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. సుమారు 3 బిలియన్ల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.

మరోవైపు ఈ కరోనా వైరస్ కారణంగా చైనాలో 3,287 మంది చనిపోగా.. స్పెయిన్, ఇటలీలలో దీని తీవ్రత తారాస్థాయిలో ఉంది. చైనా కంటే ఎక్కువగా ఈ దేశాల్లో మరణాలు సంభవిస్తుండటంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా కారణంగా ఇటలీలో 7,503 మంది.. అలాగే స్పెయిన్‌లో 4,089 మంది మృతి చెందారు. ఇక స్పెయిన్‌లో ఒక్క రోజే 442 మరణాలు సంభవించాయి. ఇక ఇరాన్‌లో 2,234 మంది, ఫ్రాన్సులో 1,331 మంది, అగ్రరాజ్యం అమెరికాలో 1,036 మృత్యువాతపడ్డారు. కాగా, భారతదేశంలో కూడా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ వ్యాధి కారణంగా 13 మంది మృతి చెందారు. అటు ప్రపంచదేశాలు కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు ఐక్యరాజ్యసమితి 2 బిలియన్‌ డాలర్ల అత్యవసర నిధిని ప్రకటించిన సంగతి విదితమే.

For More News:

ఇండియా లాక్ డౌన్.. ఏ సేవలకు బ్రేక్.? ఏవి ఉంటాయి.?

‘ఇంటికి రావద్దు ప్లీజ్’.. కరోనా అనుమానితుల ఇళ్లకు రెడ్ నోటిసులు..

దేశంలో మొట్టమొదటి కోవిడ్ 19 ఆసుపత్రి.. రిలయన్స్ సంచలనం..

గుడ్ న్యూస్.. కరోనాలా హంటా వైరస్ కాదట… అసలు నిజమిదే.!

కరోనా ఎఫెక్ట్.. దేశవ్యాప్తంగా టోల్ గేట్ ఫీజులు రద్దు..

కూరగాయలు, నిత్యావసర వస్తువుల రేట్లు ఫిక్స్.. ధరలు పెంచితే కేసులు తప్పవు..

సామాజిక దూరం పాటిస్తే.. ఇండియాలో కరోనా కేసులు 62 శాతం తగ్గుతాయట..!

Loading...
Unable to load recommendations.
Follow Us