భారత్‌లో కరోనా వైరస్ రూపాంతరం చెందుతోంది..: సీసీఎంబీ డైరెక్టర్

| Edited By:

Apr 30, 2020 | 7:58 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్‌డౌన్ విధించాయి. కరోనా వైరస్ జన్యుక్రమం గురించి తెలుసుకునేందుకు హైదరాబాద్‌లోని సీసీఎమ్‌బీ విస్త్రత స్థాయి పరిశోధనలు చేపడుతోంది. దీనిపై

భారత్‌లో కరోనా వైరస్ రూపాంతరం చెందుతోంది..: సీసీఎంబీ డైరెక్టర్
Follow us on

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్‌డౌన్ విధించాయి. కరోనా వైరస్ జన్యుక్రమం గురించి తెలుసుకునేందుకు హైదరాబాద్‌లోని సీసీఎమ్‌బీ విస్త్రత స్థాయి పరిశోధనలు చేపడుతోంది. దీనిపై సంస్థ డైరెక్టర్ రాకెశ్ మిశ్రా మాట్లాడుతూ.. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా వైరస్ బలహీనంగా ఉందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. అయితే వైరస్ జన్యుక్రమంలో మాత్రం మార్పులు వస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం సీసీఎంబీ శాస్త్రవేత్తలు వైరస్ జన్యుక్రమం గురించి మరింత సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

కాగా.. కరోనా కట్టడికై తీసుకుంటున్న చర్యలపై కూడా రాకేశ్ స్పందించారు. విస్త్రత స్తాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఆవశ్యకత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రోగ లక్షణాలు బయటపడని వారు అధిక సంఖ్యలో ఉన్నారన్న వార్తల నేపథ్యంలో ఇది మరింత అవసరమని ఆయన స్పష్టం చేశారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గట్టి చర్యలు తీసుకోవడమో లేక దేశమంతా లాక్ డౌన్ కొనసాగించమో చేయాలని రాకేశ్ సూచించారు.