AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచవ్యాప్తంగా 23 మిలియన్లు దాటిన కరోనా కేసులు..

ప్రపంచవ్యాప్తంగా 23,157,676 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 803,936 మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 15,739,185 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ప్రపంచవ్యాప్తంగా 23 మిలియన్లు దాటిన కరోనా కేసులు..
Ravi Kiran
|

Updated on: Aug 22, 2020 | 6:23 PM

Share

Coronavirus Cases World: ప్రపంచదేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశాలన్నీ కూడా దశల వారీగా లాక్ డౌన్ విధించినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 23,157,676 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 803,936 మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 15,739,185 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో 2,58,252 పాజిటివ్ కేసులు, 6062 మరణాలు సంభవించాయి. అయితే మరణాల రేటు కంటే రికవరీ రేటు అధికంగా ఉండటంతో ప్రజలు కాస్త ఊరట చెందుతున్నారు.

అమెరికా, బ్రెజిల్, రష్యా దేశాల్లో కరోనా తీవ్రతరంగా ఉంది. ప్రస్తుతం అన్ని దేశాలూ లాక్ డౌన్‌ను దశల వారీగా సడలిస్తున్న నేపథ్యంలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కేసులు(5,798,983), మరణాలు(179,240) సంభవించాయి. అటు బ్రెజిల్ లో పాజిటివ్ కేసులు 3,536,488 నమోదు కాగా, మృతుల సంఖ్య 113,454కు చేరింది. ఇక రష్యాలో 951,897 పాజిటివ్ కేసులు, 16,310 మరణాలు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా కేసులు 2,985,367 నమోదు కాగా, మృతుల సంఖ్య 56,030కి చేరింది.

Also Read:

ఏపీ విద్యార్థులకు అలెర్ట్.. డిగ్రీ, పీజీ కోర్సుల ఫీజులు ఖరారు.!

Breaking: తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..

చైనా కరోనా వ్యాక్సిన్ ధర రూ. 10 వేలు..!

సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు రీ-ఓపెన్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..

Follow Us
ప్రతిరోజూ తలస్నానం చేయడం మంచిదేనా? జలుబు వస్తుందనేది నిజమేనా?
ప్రతిరోజూ తలస్నానం చేయడం మంచిదేనా? జలుబు వస్తుందనేది నిజమేనా?
దీపావళికి ఇంటిని శుభ్రం చేస్తున్నారా? వాస్తు ప్రకారం ఈ నియమాలు..
దీపావళికి ఇంటిని శుభ్రం చేస్తున్నారా? వాస్తు ప్రకారం ఈ నియమాలు..
ఈ 3 పనులు పూర్తి చేస్తేనే పీఎం కిసాన్ సాయం.. కేంద్రం అలర్ట్..
ఈ 3 పనులు పూర్తి చేస్తేనే పీఎం కిసాన్ సాయం.. కేంద్రం అలర్ట్..
తుఫాన్‌ వస్తే ఇవి పాటించండి.. ఏపీ వాసులకు వాతావరణ శాఖ కీలక సూచనలు
తుఫాన్‌ వస్తే ఇవి పాటించండి.. ఏపీ వాసులకు వాతావరణ శాఖ కీలక సూచనలు
JEE Main 2027 దరఖాస్తుల షెడ్యూల్ విడుదల.. దరఖాస్తులు ఎప్పుడంటే?
JEE Main 2027 దరఖాస్తుల షెడ్యూల్ విడుదల.. దరఖాస్తులు ఎప్పుడంటే?
శ్రీకృష్ణుడి విశ్వరూపం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే.. వేయి తలలు..
శ్రీకృష్ణుడి విశ్వరూపం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే.. వేయి తలలు..
CLAT 2027 ఇంకా దరఖాస్తు చేసుకోలేదా..? అక్టోబర్ 31 వరకే ఛాన్స్!
CLAT 2027 ఇంకా దరఖాస్తు చేసుకోలేదా..? అక్టోబర్ 31 వరకే ఛాన్స్!
ఆర్టీసీ ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. అమల్లోకి కొత్త పథకం
ఆర్టీసీ ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. అమల్లోకి కొత్త పథకం
జాకబ్ అండ్ కో ‘శ్రీ రామచంద్ర’ వాచ్.. ధర రూ. 4.25 కోట్లు!
జాకబ్ అండ్ కో ‘శ్రీ రామచంద్ర’ వాచ్.. ధర రూ. 4.25 కోట్లు!
శ్రీలీల ప్లేస్ కొట్టేసిన కాయదు లోహర్..
శ్రీలీల ప్లేస్ కొట్టేసిన కాయదు లోహర్..