Coronavirus Cases In AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,657 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,52,955కి చేరింది. ఇందులో 19,757 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,26,344 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 7 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,854కు చేరుకుంది. ఇక నిన్న 2,155 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 91.01 సాంపిల్స్‌ను పరీక్షించారు….
నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 80, చిత్తూరు 184, తూర్పుగోదావరి 252, గుంటూరు 194, కడప 71, కృష్ణా 225, కర్నూలు 19, నెల్లూరు 62, ప్రకాశం 86, శ్రీకాకుళం 74, విశాఖపట్నం 95, విజయనగరం 66, పశ్చిమ గోదావరి 249 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,20,302కి చేరింది. అలాగే చిత్తూరులో అత్యధికంగా 806 మంది కరోనాతో మరణించారు.
Also Read:
డిసెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్.? వైరల్ అవుతున్న ట్వీట్.. వివరణ ఇచ్చిన కేంద్రం..
తెలంగాణలో బాణసంచాపై బ్యాన్ విధించిన ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ.. అమ్మకాలు చేస్తే చర్యలు..
సీఎస్‌కే ఫ్యాన్స్‌కు షాక్.. ఐపీఎల్ 2021లో కొత్త జట్టుకు కెప్టెన్‌గా సురేష్ రైనా.!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లలకు మరో బాధ్యత..
సాయం కోరిన సోనూసూద్.. స్పందించిన నెటిజన్లు.. థ్యాంక్యూ చెప్పిన రియల్ హీరో..