కరోనాపై షాకింగ్ న్యూస్.. 16 అడుగుల వరకు వైరస్ వ్యాప్తి.!
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ గురించి రోజుకో విషయం బయటపడుతోంది. జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి మాత్రమే లక్షణాలు అనుకుంటే..
Covid 19 Latest News: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ గురించి రోజుకో విషయం బయటపడుతోంది. జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి మాత్రమే లక్షణాలు అనుకుంటే.. ఆ తర్వాత రుచి తెలియకపోవడం, వాసన పసిగట్టలేకపోవడం, కండ్లు ఎర్రబడటం లాంటి కొత్త లక్షణాలు కూడా బయటపడ్డాయి. ఇక గతంలో ఆరు అడుగులు దూరం ఉంటే కరోనా సోకదని నిపుణులు తెలపగా.. ఇప్పుడు 16 అడుగులు దూరంగా ఉన్నా వైరస్ సోకుతుందని అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీ వైరాలజీ పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.
గాలిలో తేలియాడే శ్వాసకోశ బిందువులతో ప్రత్యక్ష కరోనా వైరస్ ఉంటుందని వారు నిరూపించారు. కొంతమంది కోవిడ్ 19 రోగులపై వారు తాజాగా ఓ అధ్యయనం చేశారు. ఏడు నుంచి 16 దూరం అడుగుల వరకు కరోనా రోగులను ఉంచి.. సేకరించిన ఏరోసోల్స్ నుంచి వారు ప్రత్యక్షంగా వైరస్ ను వేరు చేశారు. ఆరు అడుగులు కంటే ఎక్కువగా భౌతిక దూరం పాటించినప్పటికీ వైరస్ వ్యాపించడాన్ని వారు గుర్తించారు. చిన్న చిన్న తుంపర్లు, దగ్గు ద్వారా గాలిలోకి ప్రవేశించే కరోనా వైరస్ జన్యుక్రమం, రోగులలో ఉన్న వైరస్ జన్యుక్రమంతో వారు పోల్చారు. గదిలోపల వాతావరణంలో సుమారు 16 అడుగుల వరకు గాలి ద్వారా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని న్యూయార్క్ లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో వైరాలజిస్ట్ ఏంజెలా రాస్ముసేన్ చెప్పారు. కాగా, భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటి నిబంధనలను జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో పకడ్బందీగా పాటించాలని తెలిపారు.
Also Read: