
ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోన్న కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 11 వేలకు పైగా జనం మరణించగా.. రెండు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ వైరస్ ఇండియాలోనూ విజృంభిస్తోంది. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా 200లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఐదుగురు మరణించారు. ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ.. 25కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారిక లెక్కలు వెలవడ్డాయి.
దీంతో అటు ప్రజలు, ఇటు అధికారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే కరోనా అలెర్ట్‌తో స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు, మాల్స్‌లను మూసివేశారు. ఇక ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసుల్లోని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ని కేటాయించారు. అలాగే బయటకు వెళ్లకూడదని సూచనలు కూడా జారీ చేశారు. ఎందుకంటే.. కరోనా మహమ్మారి ఎటునుంచి ఎటాక్ చేస్తుందో.. తెలీదు. కనుక ఇంట్లో ఉండేవారు.. బయటకు వెళ్లకూడదని సూచనలు చేశారు. మరి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఎలా ఉండాలి? అనేది ఈ చిన్న చిట్కాలను పాటిస్తూ.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
1. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా కూడా శుభ్రతను పాటించడం ముఖ్యం.
2. పిల్లలకు, భార్య లేదా భర్త, తల్లిదండ్రులకు, రూమ్‌మేట్స్‌కు కాస్త దూరంగా ఉంటూ పని చేసుకోవడం మంచిది.
2. ఇంట్లోనే ఉంటున్నాం కదా బంధువులను, ఫ్రెండ్స్‌ని ఎవరినీ ఇంటికి ఆహ్వానించవద్దు.
3. ఎప్పటికప్పుడు కనీసం గంటకోసారైనా చేతులను శుభ్రపరుచుకోవడం ముఖ్యం.
4. వీలైనంతవరకూ స్వీయ నియంత్రణను పాటించండి. బయటకు వెళ్లకుండా ఉండటం ఉత్తమం.
5. అలాగే ఒక వేళ ఇంట్లో గర్భిణులు ఉంటే మరింత ప్రమాదకరం. కాబట్టి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
6. తగిన సరుకుల్ని ఇంట్లో అదుబాటులో ఉంచుకోండి. అలాగని నెలలకొద్దీ సరిపడా నిల్వచేయడం సరికాదు.
7. ఉదయం పూట వాకింగ్స్, జాగింగ్స్ చేయడం హెల్త్‌కి మంచిది.
8. అలాగే వ్యాధినిరోధక శక్తిని కోల్పోకుండా ఉండటానికి ఎక్కువగా ఫ్రూట్స్‌ని తీసుకోవడం మంచింది.
ఈ చిన్న చిట్కాలతో మీతో పాటు.. మీ కుటుంబసభ్యులను కూడా కరోనా వైరస్ బారి నుంచి కాపాడుకోండి.
Read More this also: బిఎస్‌ఎన్‌ఎల్ క్రేజీ ఆఫర్.. రోజుకి 5జీవీ ఫ్రీ..ఫ్రీ..
జబర్దస్త్ షోలో క్లాషెస్.. స్టేజ్ దిగి వెళ్లిపోయిన టీం లీడర్..
కరోనాలో కనిపించే మరో రెండు కొత్త లక్షణాలు.. ఇవి ఉన్నవారు కోలుకోవడం కష్టమే
నిర్భయ దోషుల్ని ఉరితీసే తలారికి ఎంత డబ్బు ఇస్తారంటే..
అలెర్ట్: ఆ గ్రూపు రక్తం ఉన్నవారికి కరోనా ఎక్కువగా సోకుతుందట
సిద్ధార్థ్‌ని త్వరగా వదిలించుకున్నా.. లేకుంటే నా లైఫ్ మరో సావిత్రిలా ఉండేది..