AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus : గుడ్‌న్యూస్‌, కరోనా చికిత్సకు అందుబాటులోకి రానున్న కొత్త మందు

కరోనా వైరస్‌ను నియంత్రణలో పెట్టడానికి యావత్‌ ప్రపంచం తీవ్రంగా కృషి చేస్తోంది. మనుషుల ప్రాణాలను మింగేస్తున్న ఆ వైరస్‌ను అదుపులోకి తీసుకురావడానికి వైద్య నిపుణులు అహర్నిశలు కృషి చేస్తున్నారు.

Coronavirus : గుడ్‌న్యూస్‌,  కరోనా చికిత్సకు అందుబాటులోకి రానున్న కొత్త  మందు
Molnupiravir
Balu
| Edited By: Phani CH|

Updated on: May 22, 2021 | 12:45 PM

Share

కరోనా వైరస్‌ను నియంత్రణలో పెట్టడానికి యావత్‌ ప్రపంచం తీవ్రంగా కృషి చేస్తోంది. మనుషుల ప్రాణాలను మింగేస్తున్న ఆ వైరస్‌ను అదుపులోకి తీసుకురావడానికి వైద్య నిపుణులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇప్పటికే చాలా దేశాల్లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది.. కరోనా విజృంభణకు జడిసిన జనం వ్యాక్సిన్‌ బాట పట్టారు. మన దగ్గర కూడా కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ టీకాలు తీసుకోవడానికి ప్రజలు క్యూలు కడుతున్నారు. మొన్నామధ్యనే రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వీ కూడా వచ్చేసింది. ఇప్పుడు మరో కొత్త ఔషధం మనముందుకొస్తోంది. అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో జంతువులు, మనుషులపై రెండు దశలలో క్లినికల్‌ ట్రయల్స్‌ కూడా పూర్తి చేసుకున్న మోల్ను ఫిరావిర్‌ -400 ఎంజీ అనే ఆ ఔషధం ఇప్పుడు మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు రెడీ అయ్యింది. ఈ ట్రయల్స్ మన హైదరాబాద్‌లోనే జరుగుతుండటం గమనార్హం. ఈ ట్రయల్స్‌ దేశంలోనే తొలిసారిగా యశోద హాస్పిటల్‌లో జరగబోతున్నాయి.. ఈ విషయాన్ని హాస్పిటల్‌ మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ లింగయ్య తెలిపారు.

ఈ ట్రయల్స్‌ను నాట్కో ఫార్మా-యశోద ఆస్పత్రిలో సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిర రెండు దశల ట్రయల్స్‌లో మంచి ఫలితాలు వచ్చాయని చెబుతున్నారు. ఎవరికీ ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ రాలేదని, ఈ ఔషధాన్ని వాడిన వారంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని అంటున్నారు. పైగా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారంటున్నారు. ఇది శుభసూచకమే! మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం దేశ వ్యాప్తంగా 34 ఆసుపత్రులను, 1,218 మందిని ఎంపిక చేసుకున్నారు. యశోద హాస్పిటల్‌లో 50 మందిపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తారు. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయి మైల్డ్‌ సింప్టమ్స్‌తో బాధపడుతున్నవారిని ఇందు కోసం ఎంచుకున్నారు.. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వారిని ఎంపిక చేసుకున్న వైద్య బృందం వారికి మందు ఎలా పని చేస్తుందన్నది తెలుసుకుంటారు.

కరోనా సోకిన పేషంట్‌ వరుసగా అయిదు రోజుల పాటు మోల్ను ఫిరావిర్‌ -400 ఎంజీ మందులు వాడితే టక్కున కోలుకున్నారని అంటున్నారు. ఆ తర్వాత ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేస్తే నెగటివ్‌ వచ్చిందని చెబుతున్నారు. క్లినికల్ ట్రయల్స్‌లో ఎవరినీ కూడా హాస్పిటల్‌లో జాయిన్‌ చేసుకోరు. ఔట్‌ పేషంట్‌గానే పరిగణించి రెండు పూటలా ఈ మందులు ఇస్తారు. ఎప్పటికప్పుడు వైద్యులు వారి ఆరోగ్యపరిస్థితిని తెలుసుకుంటారు. మరో రెండు నెలల్లో మూడో దశ క్లినియల్ ట్రయల్స్‌ పూర్తవుతాయట! ఆ తర్వాత ఫోర్త్‌ ఫేజ్‌ ట్రయల్స్‌ జరుగుతాయి.. ఆ తర్వాత ప్రజలకు ఈ మందు అందుబాటులోకి వస్తుంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: చపాతీలు ఇలా కూడా చేస్తారా..?? ఈ స్టైల్ చూసి ఫిదా ఆయన నెటిజన్లు.. ( వీడియో )

Viral Video: పోలీసుల నుంచి తప్పించుకుని డ్రైనేజీలో దూకిన దొంగ.. వైరల్‏గా మారిన వీడియో...