గుడ్ న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు…

|

Nov 03, 2020 | 10:24 AM

దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది.

గుడ్ న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు...
Follow us on

Corona Positive Cases India: దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. పాజిటివ్ కేసుల కంటే రికవరీ రేటు అధికంగా ఉంటోందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 38,310 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక, ఒక్క రోజే మాయదారి వైరస్ బారిన పడి 490 మంది మృత్యువాతపడ్డారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 6.55 శాతానికి తగ్గాయి. తాజాగా కేంద్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, రికవరీ రేటు 91.96 శాతంగా నమోదు అయ్యింది. మరణాలు రేటు 1.49 శాతానికి చేరింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 82,67,623కు చేరింది. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 5,41,405 మంది చికిత్స పొందుతుండగా.. ఇప్పటివరకు 76,03,121 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా కరోనాతో ఇప్పటి వరకు 1,23,097 మంది ప్రాణాలు కోల్పోయారు.