కరోనా కల్లోలం.. ఒక్క రోజే 5 వేలకు పైగా..

|

Sep 06, 2020 | 7:54 PM

తమిళనాడులో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. మహమ్మారి వ్యాప్తి చెందకుండా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి...

కరోనా కల్లోలం.. ఒక్క రోజే 5 వేలకు పైగా..
Follow us on

Tamil nadu corona : తమిళనాడులో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. మహమ్మారి వ్యాప్తి చెందకుండా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.

ఆదివారం రోజు కొత్తగా తమిళనాడు రాష్ట్రంలో 5783  కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,63,480 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఇవాళ కరోనా నుంచి కోలుకొని 5,820 మంది డిశ్చార్జ్ అవగా, మొత్తం 4,04,186 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా వల్ల ఇవాళ 88 మంది మృతి చెందగా, మొత్తం 7,836 మంది మృతి చెందారు. ప్రస్తుతం 51,458 మందికి కరోనా చికిత్స అందిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.