Corona Effect: కరోనా ఎఫెక్ట్.. చైనాలో ‘చతికిలబడిన’ 5 జీ నెట్ వర్క్
కరోనా దెబ్బకు చైనాలో 5 జీ నెట్ వర్క్ 'చతికిలబడింది.' ఈ తదనంతర తరం నెట్ వర్క్ ఆచరణ సాధ్యమయ్యేందుకు చాలా డిలే అవకాశాలు కనబడుతున్నాయి.
Corona Effect: కరోనా దెబ్బకు చైనాలో 5 జీ నెట్ వర్క్ ‘చతికిలబడింది.’ ఈ తదనంతర తరం నెట్ వర్క్ ఆచరణ సాధ్యమయ్యేందుకు చాలా డిలే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరు అతి పెద్ద 5 జీ ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లు గత జనవరి 31 నుంచి వాయిదా పడుతూ వస్తున్నాయి. వీటిలో గ్యాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ప్రాజెక్టు, జియాంగ్ జీ ప్రావిన్స్ లోని హాస్పిటల్ సంబంధ ప్రాజెక్టు, గన్సు రాష్ట్రంలోని పోలీస్ సంబంధ ప్రాజెక్టు ఉన్నాయి. కరోనా వైరస్ కు కేంద్ర బిందువుగా మారిన వూహాన్ సిటీలో గల ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ కు సంబంధించిన ప్రొవైడర్ల ప్రధాన కార్యాలయం ఇంకా పని చేయక దాదాపు మూతబడింది. నిజానికి 5 జీ టెక్నాలజీకి చైనా అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. కరోనా కారణంగా అనేక ఆంక్షలు అమలులో ఉన్నందున.. టెలికాం సంస్థల సిబ్బంది, నెట్ వర్క్ ఆపరేటర్లు చేతులు ముడుచుకుని కూర్చున్నారు.