Heroine Trisha : చిక్కుల్లో హీరోయిన్ త్రిష..

  ప్రముఖ హిరోయిన్ త్రిష..రెండు దశాబ్దాల నుంచి సౌత్ ఇండియాలో అగ్ర కథానాయికగా కొనసాగుతున్నారు. ఇటీవలే తమిళంలో '96' మూవీలో లీడ్ రోల్‌లో నటించి బ్లాక్‌బాస్టర్ హిట్ అందుకుంది ఈ సీనియర్ నటి.

Heroine Trisha : చిక్కుల్లో హీరోయిన్ త్రిష..
ఇటీవలే విజయ్ సేతుపతి నటించిన 96సినిమాతో సూపర్ హిట్ ను అందుకుంది త్రిష 
Follow us
Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 22, 2020 | 5:44 PM

Heroine Trisha :  ప్రముఖ హిరోయిన్ త్రిష..రెండు దశాబ్దాల నుంచి సౌత్ ఇండియాలో అగ్ర కథానాయికగా కొనసాగుతున్నారు. ఇటీవలే తమిళంలో ’96’ మూవీలో లీడ్ రోల్‌లో నటించి బ్లాక్‌బాస్టర్ హిట్ అందుకుంది ఈ సీనియర్ నటి. ఇప్పటికీ తమిళ్‌లో ఆమె హవా సాగుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా త్రిష తాజాగా వివాదంలో చిక్కుకుంది. ప్రస్తుతం తమిళంలో త్రిష ‘పరమపదం విలయట్టు’ అనే సినిమా చేస్తోంది. ఆ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌ను ఇటీవలే గ్రాండ్‌గా నిర్వహించింది చిత్ర యూనిట్. అయితే అనూహ్యంగా ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టింది ఈ సీనియర్ హీరోయిన్. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ..నిర్మాతల మండలి దృష్టికి తీసుకెళ్లింది. రెండు రోజుల్లో సదరు సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనాలని..లేకుంటే సగం రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుందని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది నిర్మాతల మండలి. సినిమా ప్రమోషన్లకు నటీనటుల రాకపోవడం వల్ల..చిన్న నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని..ఎవరైనా ఇంకోసారి ఇటువంటివి రిపీట్ చేస్తే..తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించింది.