రూ.60 కోట్ల బడ్జెట్‌తో కొత్త సినిమా.. ప్రకటించిన మోహన్ బాబు

మంచు మోహన్ బాబు నట వారసులు మళ్లీ వరుస చిత్రాలతో బిజీ అవబోతున్నారు. గత కొన్నాళ్లుగా సినిమాలకి దూరంగా ఉన్న మంచు ఫ్యామిలీ ఇప్పుడు మళ్లీ ఓ ప్రతిష్టాత్మక చిత్రం ద్వారా కనువిందు..

  • Tv9 Telugu
  • Publish Date - 4:56 pm, Sat, 22 February 20
రూ.60 కోట్ల బడ్జెట్‌తో కొత్త సినిమా.. ప్రకటించిన మోహన్ బాబు

మంచు మోహన్ బాబు నట వారసులు మళ్లీ వరుస చిత్రాలతో బిజీ అవబోతున్నారు. గత కొన్నాళ్లుగా సినిమాలకి దూరంగా ఉన్న మంచు ఫ్యామిలీ ఇప్పుడు మళ్లీ ఓ ప్రతిష్టాత్మక చిత్రం ద్వారా కనువిందు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన విషయాన్ని నిర్మాత, నటుడు మోహన్ బాబు తాజాగా ప్రకటించారు. మహా శివరాత్రి సందర్భంగా శుక్రవారం శ్రీకాళహస్తీశ్వరున్ని దర్శించుకున్న మోహన్ బాబు.. రూ.60 కోట్ల బడ్జెట్‌తో ‘భక్త కన్నప్ప’ సినిమాను నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయంలో ఆ మహా దేవుడికి సంబంధించిన సినిమాని ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విష్ణు హీరోగా ‘భక్త కన్నప్ప’ తెరకెక్కనుండగా.. మనోజ్ హీరోగా ‘అహం బ్రహ్మాస్మి’ అనే భారీ చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నామని మోహన్ బాబు తెలిపారు. కాగా త్వరలోనే ఈ రెండు చిత్రాలు సెట్స్‌పైకి వెళ్లనున్నాయని, నటీనటులను కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు మోహన్ బాబు.