Corona Cases AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 59,551 సాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 357 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,80,075కి చేరింది. ఇందులో 3862 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,69,124 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా నలుగురు చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 7089కు చేరుకుంది. ఇక నిన్న 355 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 1,14,74,797 సాంపిల్స్‌ను పరీక్షించారు.
నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 27, చిత్తూరు 54, తూర్పుగోదావరి 58, గుంటూరు 42, కడప 14, కృష్ణా 54, కర్నూలు 9, నెల్లూరు 28, ప్రకాశం 9, శ్రీకాకుళం 16, విశాఖపట్నం 28, విజయనగరం 4, పశ్చిమ గోదావరి 14 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
Also Read:
యాంటీ బయోటిక్స్ అతిగా వాడుతున్నారా.! అయితే, యమ డేంజర్.. చికిత్సలేని ‘సూపర్ గనేరియా’ వ్యాధి వస్తుందట
‘అమ్మఒడి’ వర్తించని వారికి గుడ్ న్యూస్.. ఆ లబ్దిదారులకు మరో అవకాశాన్ని కల్పించిన జగన్ సర్కార్.!
ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై ఆర్‌బీఐ స్పందన.. వాటి పట్ల ఆకర్షితులు కావద్దంటూ సూచన..
బిగ్ బాస్ 4: కెరీర్‌పై ఒట్టేసి చెబుతున్నా.. మెహబూబ్ అలా ఎందుకు అన్నాడో నాకు తెలియదు: సోహైల్