Corona Cases India: దేశంలో కొత్తగా 21,822 పాజిటివ్ కేసులు, 299 మరణాలు.. 96 శాతానికి చేరిన రికవరీ రేటు…

Corona Cases India: దేశంలో గడిచిన 24 గంటల్లో 21,822 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,66,674 ..

Corona Cases India: దేశంలో కొత్తగా 21,822 పాజిటివ్ కేసులు, 299 మరణాలు.. 96 శాతానికి చేరిన రికవరీ రేటు…
Corona-Virus-India

Updated on: Dec 31, 2020 | 10:39 AM

Corona Cases India: దేశంలో గడిచిన 24 గంటల్లో 21,822 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,66,674 చేరుకుంది. ఇందులో 2,57,656 యాక్టివ్ కేసులు ఉండగా.. 98,60,280 కరోనా నుంచి కోలుకున్నారు. ఇక తాజాగా 299 మంది వైరస్ కారణంగా చనిపోవడంతో.. దేశంలో ఇప్పటివరకు 1,48,738 కరోనా మరణాలు సంభవించాయి.

అటు గత కొద్దిరోజులుగా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల లేకపోవడం ఊరటను ఇచ్చే అంశం. అన్ని రాష్ట్రాల్లోనూ రికవరీ రేటు పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో బుధవారం 26,139 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 2.51 శాతానికి తగ్గాయి. మరణాలు రేటు 1.45 శాతానికి తగ్గింది. దేశంలో 96.04 శాతానికి రికవరీ రేటు చేరిందంది.

Also Read:

తెలుగు రాష్ట్రాల ప్రజలకు పండుగ శుభవార్త.. ప్రత్యేక రైళ్లు పొడిగింపు.. పూర్తి వివరాలివే..!

వైఎస్సార్ రైతు భరోసా డబ్బు జమ కాలేదా.? అయితే ఈ నెంబర్‌కు కాల్ చేయండి.!

ట్యాక్స్ పేయర్స్‌కు గుడ్ న్యూస్.. మరోసారి ఐటీ రిటర్న్స్ గడువు పొడిగింపు

ఏపీ ప్రజలకు ఆర్టీసీ ఓ గుడ్ న్యూస్.. మరో బ్యాడ్ న్యూస్.. అదేంటంటే.!