టి.కాంగ్రెస్ ఎత్తుగడ.. ఫోకస్ అంతా దానిపైనే

తెలంగాణ కాంగ్రెస్ నేతలు మునిసిపల్ ఎన్నికలకు ఒకవైపు సమాయత్తం అవుతూనే మరోవైపు ఎన్నికలను వాయిదా వేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. రిజర్వేషన్లను వెల్లడించిన నెల రోజుల తర్వాత ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో నిత్యం గాంధీభవన్‌లో సమావేశమవుతూ.. ఎన్నికల వ్యూహరచ చేస్తున్నారు. మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ఓ పుస్తకంలో టీఆర్ఎస్ పార్టీ పొందుపరిచిన అంశాలపైనే ఫోకస్ చేయాలని టీపీసీసీ అధినాయకత్వం నిర్ణయించింది. ప్రతీ ఎన్నికల ముందు ప్రధాన రాజకీయ పార్టీలు […]

టి.కాంగ్రెస్ ఎత్తుగడ.. ఫోకస్ అంతా దానిపైనే
Follow us

|

Updated on: Jan 03, 2020 | 3:38 PM

తెలంగాణ కాంగ్రెస్ నేతలు మునిసిపల్ ఎన్నికలకు ఒకవైపు సమాయత్తం అవుతూనే మరోవైపు ఎన్నికలను వాయిదా వేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. రిజర్వేషన్లను వెల్లడించిన నెల రోజుల తర్వాత ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో నిత్యం గాంధీభవన్‌లో సమావేశమవుతూ.. ఎన్నికల వ్యూహరచ చేస్తున్నారు. మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ఓ పుస్తకంలో టీఆర్ఎస్ పార్టీ పొందుపరిచిన అంశాలపైనే ఫోకస్ చేయాలని టీపీసీసీ అధినాయకత్వం నిర్ణయించింది.

ప్రతీ ఎన్నికల ముందు ప్రధాన రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టోను విడుదల చేయడం రివాజు. తమ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే.. పరిపాలనా కాలంలో చేసే కార్యాచరణను, చేపట్టబోయే పథకాల వివరాలను మ్యానిఫెస్టోలో పొందుపరుస్తారు. అలాగా గత మునిసిపల్ ఎన్నికల్లోను, ఆ తర్వాత ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోను టిఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టో అంశాలను మరీ ముఖ్యంగా వాటిలో నెరవేర్చని అంశాలను హైలైట్ చేస్తూ మునిసిపాలిటీల్లో ఓటర్ల దగ్గరకు వెళ్ళాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయింంచింది.

కొత్త మునిసిపల్ చట్టం అమలుపై నిర్దిష్టమైన విధానంతో గులాబీ పార్టీ మునిసిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించాలని తలపెట్టిన వెంటనే గులాబీ పార్టీ గతంలో హామీ ఇచ్చి, నెరవేర్చని అంశాలపై ఫోకస్ చేయాలని, తద్వారా అధికార పార్టీని ఎండగట్టాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించడం విశేషం.

Latest Articles