Corona Vaccine: కరోనా‌పై యద్ధంలో కీలక మలుపు.. వ్యాక్సిన్ల ఆమోదంపై ప్రధాని మోదీ ఏమన్నారంటే..!

Corona Vaccine India: ఆక్స్‌‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌తో పాటు..భారత్ బయోటెక్ తయారు చేస్తోన్న కోవాగ్జిన్‌ టీకాలకు డీసీజీఐ..

Corona Vaccine: కరోనా‌పై యద్ధంలో కీలక మలుపు.. వ్యాక్సిన్ల ఆమోదంపై ప్రధాని మోదీ ఏమన్నారంటే..!
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 03, 2021 | 12:49 PM

Corona Vaccine India: ఆక్స్‌‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌తో పాటు..భారత్ బయోటెక్ తయారు చేస్తోన్న కోవాగ్జిన్‌ టీకాలకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా వ్యాక్సిన్ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ”ఇది ప్రతీ భారతీయుడు గర్వించదగిన విషయమని.. ఆమోదం లభించిన రెండు వ్యాక్సిన్లు దేశీయంగా తయారు చేయబడినవి అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేయడంలో శాస్త్రవేత్తల కృషి వెలకట్టలేనిదని మోదీ తెలిపారు. కరోనాపై చేస్తున్న యుద్ధంలో డీసీజీఐ వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వడం కీలకం కానుంది. దేశాన్ని కరోనా రహితంగా మార్చేందుకు మార్గం ఏర్పడిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.