ప్రధాని మోడీకి అభినందనలు.. కానీ: మెహబూబా ముఫ్తీ

| Edited By: Srinu

Mar 07, 2019 | 5:34 PM

కశ్మీర్: ప్రధాని నరేంద్ర మోడీ సియోల్ శాంతి పురస్కారం అందుకోవడంపై కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ స్పందించారు. సియోల్ శాంతి పురస్కారం అందుకున్నందుకు ప్రధానికి అభినందనలు. అయితే సార్…మీరు ఇండియాకు వచ్చి దేశవ్యాప్తంగా కశ్మీరీలపై జరుగుతున్న దాడులను ఎప్పుడు ఖండిస్తారా అని మేమంతా ఎదురుచూస్తున్నాం. గవర్నరే వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తుంటే మాకింకా ఆశలెలా ఉంటాయని ఆమె ప్రధానిని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌత్ కొరియాలో ఉన్నారు. పుల్వామా ఉగ్రదాడి […]

ప్రధాని మోడీకి అభినందనలు.. కానీ: మెహబూబా ముఫ్తీ
Follow us on

కశ్మీర్: ప్రధాని నరేంద్ర మోడీ సియోల్ శాంతి పురస్కారం అందుకోవడంపై కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ స్పందించారు. సియోల్ శాంతి పురస్కారం అందుకున్నందుకు ప్రధానికి అభినందనలు. అయితే సార్…మీరు ఇండియాకు వచ్చి దేశవ్యాప్తంగా కశ్మీరీలపై జరుగుతున్న దాడులను ఎప్పుడు ఖండిస్తారా అని మేమంతా ఎదురుచూస్తున్నాం. గవర్నరే వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తుంటే మాకింకా ఆశలెలా ఉంటాయని ఆమె ప్రధానిని ప్రశ్నించారు.

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌత్ కొరియాలో ఉన్నారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో విచారణ జరిపి, చర్యలు తీసుకునేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఓ అవకాశం ఇవ్వాలని అంతకుముందు మెహబూబా కోరారు.