హైపర్ ఆదికి అనసూయ బంపర్ ఆఫర్.. తనతో సమానంగా రెమ్యునరేషన్..

జబర్దస్త్‌లో హైపర్ ఆదికి ఓ ప్రత్యేకత ఉంది. ఒక పంచ్‌ నుంచి తేరుకునేలోపే.. మరో పంచ్‌ వేసి కడుబుబ్బా నవ్విస్తాడు. అంతేకాకుండా.. అప్పుడుప్పుడు స్కిట్‌లో భాగంగా.. జడ్జిలపై, యాంకర్లపై కూడా పంచ్‌లు వేస్తూంటాడు. అలాగే అనసూయ, ఆదిల రొమాన్స్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన...

హైపర్ ఆదికి అనసూయ బంపర్ ఆఫర్.. తనతో సమానంగా రెమ్యునరేషన్..

Edited By:

Updated on: Jun 14, 2020 | 12:18 PM

జబర్దస్త్‌లో హైపర్ ఆదికి ఓ ప్రత్యేకత ఉంది. ఒక పంచ్‌ నుంచి తేరుకునేలోపే.. మరో పంచ్‌ వేసి కడుబుబ్బా నవ్విస్తాడు. అంతేకాకుండా.. అప్పుడుప్పుడు స్కిట్‌లో భాగంగా.. జడ్జిలపై, యాంకర్లపై కూడా పంచ్‌లు వేస్తూంటాడు. అలాగే అనసూయ, ఆదిల రొమాన్స్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆది స్కిట్ మొదలైందంటే చాలు.. అనసూయ మీద వేసే పంచ్ కోసం వీక్షకులు ఎదురు చూస్తూంటారు. ఆ పంచ్‌కి సిగ్గుపడుతూ అనసూయ రియాక్షన్ కూడా ఎప్పుడూ హిట్టే. అయితే తాజాగా హైపర్ ఆదికి అనసూయ బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. హైపర్ ఆదితో కలిసి అనసూయ ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రొడ్యూస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పెద్ద స్టార్స్ కూడా సినిమాలకంటే వెబ్ సిరీస్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఎప్పుడూ సినిమాలు, షోలతో బిజీగా ఉండే అనసూయ కూడా ఓ వెబ్ సిరీస్‌లలో నటించేందుకు కూడా ఓకే చెప్పిందట. అయితే ఆ వెబ్ సిరీస్ కోసం అమ్మడు భారీగానే డిమాండ్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా ఆ వెబ్ సిరీస్‌లో నటించడానికి హైపర్ ఆదికి కూడా ఓ అవకాశం ఇప్పించిందట. అలాగే తనతో సమానంగా ఆదికి కూడా రెమ్యునరేషన్ ఇవ్వాలని అనసూయ కోరినట్టు తెలుస్తోంది.

Read More: 

అసభ్యంగా ప్రవర్తించాడని.. కొడుకుపైనే కేసు పెట్టిన నటి

భక్తులకు గుడ్‌న్యూస్.. శ్రీకాళహస్తిలో దర్శనాలకు గ్రీన్ సిగ్నల్..

యాంకర్ సుమ అరుదైన ఫొటో.. చూస్తే అవాక్కవ్వాల్సిందే..