AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూలిన గోల్కొండ కోట ప్రహారీ గోడ

భాగ్యనగరంలో కురిసిన భారీ వర్షాలు చేసిన బీభత్సం అంతా ఇంతా కాదు. మూసీ నది వందేళ్ల తరువాత పోటెత్తింది. రెండు రోజులపాటు కురిసిన కుండపోత వర్షాలకు వందలాది కాలనీలు నీట మునిగాయి.

కూలిన గోల్కొండ కోట ప్రహారీ గోడ
Balaraju Goud
|

Updated on: Oct 17, 2020 | 9:48 AM

Share

భాగ్యనగరంలో కురిసిన భారీ వర్షాలు చేసిన బీభత్సం అంతా ఇంతా కాదు. మూసీ నది వందేళ్ల తరువాత పోటెత్తింది. రెండు రోజులపాటు కురిసిన కుండపోత వర్షాలకు వందలాది కాలనీలు నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 30 మంది ప్రాణాలను కోల్పోయారు. అటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులన్నీ అలుగు పారుతున్నాయి. ఈ భారీ వర్షాల ప్రభావం పురాతన కట్టడాలపై పడింది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన గోల్కొండ గోడ కూడ కదిలిపోయింది. భారీ వర్షాలకు గోల్కొండ కోటలోని శ్రీజగదాంబికా అమ్మవారి ఆలయం ముందున్న దాదాపు 20 అడుగుల ఎత్తయిన గోడ కూలిపోయింది. కొవిడ్‌ నేపథ్యంలో పర్యాటకుల తాకిడి తక్కువగా ఉండటంతో ప్రమాదం తప్పింది. పది నెలల క్రితమే ఈ గోడపైన ధ్వంసమైన బురుజులకు పురావస్తుశాఖ అధికారులు మరమ్మతులు చేయించారు. అయితే, ప్రహరీ కింది భాగంలో అప్పటికే పగుళ్లు వచ్చినా వారు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నాని ఆ గోడ కుప్పకూలిందని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండిః తెలంగాణకు పొంచి ఉన్న మరో వానగండం

Follow Us
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది