తెలంగాణకు పొంచి ఉన్న మరో వానగండం

గత మూడు రోజుల క్రితం కురిసిన కుండపోత వర్షానికి విలవిలలాడిన భాగ్యనగర్ వాసులకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణకు మరో వాన గండం పొంచి ఉందని తెలిపారు.

తెలంగాణకు పొంచి ఉన్న మరో వానగండం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 17, 2020 | 9:43 AM

గత మూడు రోజుల క్రితం కురిసిన కుండపోత వర్షానికి విలవిలలాడిన భాగ్యనగర్ వాసులకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణకు మరో వాన గండం పొంచి ఉందని తెలిపారు. బంగాళఖాతంలో ఈనెల 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో ఈనెల 18, 19న మోస్తరు వానలు కురుస్తాయిని, 20వ తేదీ నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపారు. అటు తెలంగాణ వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురుస్తాయిని పేర్కొంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అయితే, ఇప్పటికే భారీ వర్షాలతో రాష్ట్రంలోని చెరువులన్నీ అలుగు పోస్తుండగా మళ్లీ కురిసే వానలు ఎం కొంపముంచాయోనని ఆందోళనలు మొదలవుతున్నాయి.

అటు హైదరాబాద్‌ నగరంలో ఇప్పటికీ జల దిగ్భంధంలో ఉన్న చాలా కాలనీల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ టీమ్స్ సహాయకచర్యలు కొనసాగిస్తున్నాయి. ఎవరద బాధిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో కీలక పాత్ర పోశిస్తున్నాయి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో నాలుగు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు జీహెచ్‌ఎంసీలో రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిం చాయి.

ఇదీ చదవండిః ఉప్పొంగుతోన్న నాగార్జున సాగర్ డ్యాం 

ఇదీ చదవండిః కృష్ణవేణి మహోగ్రరూపం.. ప్రకాశం బ్యారేజీలోకి 7.62 లక్షల క్యూసెక్కుల వరదనీరు