పెళ్లిళ్లకు కేవలం 50 మందికి మాత్ర‌మే ప‌ర్మిష‌న్, 104కి కాల్ చేసిన 3 గంట్ల‌లో బెడ్.. సీఎం జ‌గ‌న్ కీల‌క ఆదేశాలు

|

Apr 27, 2021 | 4:05 PM

స్పందన కార్యక్రమంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జగన్ సమీక్ష నిర్వ‌హించారు. కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడికి.....

పెళ్లిళ్లకు కేవలం 50 మందికి మాత్ర‌మే ప‌ర్మిష‌న్, 104కి కాల్ చేసిన 3 గంట్ల‌లో బెడ్.. సీఎం జ‌గ‌న్ కీల‌క ఆదేశాలు
Cm Jagan
Follow us on

స్పందన కార్యక్రమంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జగన్ సమీక్ష నిర్వ‌హించారు. కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. వ్యాక్సినేషన్ తదితర అంశాలపై అధికారులతో ముఖ్య‌మంత్రి మాట్లాడారు. 104 కాల్ సెంటర్స్ ప‌నితీరు స‌మ‌ర్థ‌వంతంగా ఉండాల‌ని, ఎటువంటి లోటుపాట్లు ఉండ‌కూడ‌ద‌ని అధికారుల‌కు సూచించారు. 104కి బాధితులు కాల్ చేసిన వెంట‌నే వారికి పరిష్కారం చూపాలన్నారు. 104కి కాల్ చేసిన 3 అంటే 3 గంటల్లో బెడ్ కేటాయించాలని ఆదేశించారు.

క‌రోనా బాధితులకు ఉచితంగానే మందులు ఇవ్వాలని సీఎం జ‌గ‌న్ మ‌రోసారి అధికారుల‌ను ఆదేశించారు. 104 కాల్‌ సెంటర్‌కు సంబంధించి డాక్ట‌ర్లు ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉండాలని స్ప‌ష్టం చేశారు. కొవిడ్ చికిత్స అందిస్తున్న వైద్యశాలలను జేసీ పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లాస్థాయిలో కొవిడ్‌ ఆస్పత్రులను క్లస్టర్లుగా విభజించాలని.. అన్ని ఆస్పత్రుల్లో సిబ్బంది కొర‌త లేకుండా చూడాల‌ని సీఎం ఆదేశించారు. ఎక్కడ ఖాళీలున్నా వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి.. 48 గంటల్లో నియామకాలు పూర్తిచేయాలని సూచించారు. పెళ్లిళ్లకు కేవలం 50 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్న‌ట్లు స్ఫ‌స్టం చేశారు.

Also Read: తల్లి మృతదేహన్ని తరలించేందుకు అంబులెన్స్ దొరకలేదు.. బైక్‌పైనే 20 కిలోమీటర్లు తీసుకెళ్లిన కుమారుడు

ఆసుపత్రిలో రగడ.. పోలీసుల ముందే కొట్టుకున్న నర్సు, డాక్టర్.. వీడియో వైరల్..