AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సముద్ర తీరంపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష… నివార్ తుఫాన్‌పై ఆరా..

తుఫాన్ సహాయక చర్యలను పర్యవేక్షించడానికి స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామి ఏకంగా సముద్ర తీరంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రెవెన్యూ, హోమ్, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ విభాగం మంత్రులు...

సముద్ర తీరంపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష... నివార్ తుఫాన్‌పై ఆరా..
Sanjay Kasula
|

Updated on: Nov 24, 2020 | 3:37 PM

Share

CM V Narayanasamy Reviews :  తీరం వైపు దూసుకొస్తోన్న నివార్ తుఫాన్ వల్ల తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పొరుగునే ఉన్న పుదుచ్చేరిపైనా నివార్‌ ప్రభావం ఉంటుందని, 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటూ వాతావరణ శాఖ అధికారులు జారీ చేసిన హెచ్చరికలతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్ సహాయక చర్యలను పుదుచ్చేరి ప్రభుత్వం ముమ్మరం చేసింది. నివార్ పెను తుఫాన్‌ను రూపుదాల్చిన పరిస్థితుల్లో ప్రాణ నష్టాన్ని వీలైనంతగా తగ్గించడానికి ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోంది.

తుఫాన్ సహాయక చర్యలను పర్యవేక్షించడానికి స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామి ఏకంగా సముద్ర తీరంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రెవెన్యూ, హోమ్, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ విభాగం మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహించారు.

అధికారులు, జాతీయ, రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో చర్చించారు. ముందస్తు చర్యలపై చర్చించారు. తుఫాన్ ప్రభావం అంచనాలకు మించి ఉండొచ్చని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రాణనష్టాన్ని నివారించడానికి అవసరమైన అన్ని రకాల ముందు జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు.

నివార్ తుఫాన్ చెన్నై నగర శివార్లలోని మమళ్లాపురం-పుదుచ్చేరిలోని కరైకల్ మధ్య తీరాన్ని దాటొచ్చంటూ వాతావరణ శాఖ అధికారులు ఇదివరకే అంచనా వేశారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఉన్న ఈ తుఫాన్ క్రమంగా పశ్చిమం వైపు కదులుతోంది. బుధవారం సాయంత్రం నాటికి మామళ్లాపురం-కరైకల్ మధ్య తీరాన్ని దాటుతుంది. ఆ సమయంలో 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేశారు.