ఇల్లులేని నిరుపేద ఉండకూడదు: కేసీఆర్

| Edited By:

Dec 11, 2019 | 3:27 PM

గజ్వేలులో సీఎం కేసీఆర్ పర్యటించారు. అలాగే.. ములుగులో నూతనంగా నిర్మించిన అటవీ కళాశాల.. పరిశోధనా కేంద్రాన్ని కేసీఆర్ ప్రారంభించారు. తరువాత కళాశాల ఆవరణలో.. సీఎం కేసీఆర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కళాశాలలోని సిబ్బంది, విద్యార్థులతో కేసీఆర్ ముచ్చటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. గజ్వేల్లో ఇల్లులేని నిరుపేద ఉండకూడదని అన్నారు. నియోజకవర్గ సమస్యలపై ఒక రోజంతా చర్చించుకుందామని చెప్పారు. గజ్వేల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని.. పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు […]

ఇల్లులేని నిరుపేద ఉండకూడదు: కేసీఆర్
Follow us on

గజ్వేలులో సీఎం కేసీఆర్ పర్యటించారు. అలాగే.. ములుగులో నూతనంగా నిర్మించిన అటవీ కళాశాల.. పరిశోధనా కేంద్రాన్ని కేసీఆర్ ప్రారంభించారు. తరువాత కళాశాల ఆవరణలో.. సీఎం కేసీఆర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కళాశాలలోని సిబ్బంది, విద్యార్థులతో కేసీఆర్ ముచ్చటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. గజ్వేల్లో ఇల్లులేని నిరుపేద ఉండకూడదని అన్నారు. నియోజకవర్గ సమస్యలపై ఒక రోజంతా చర్చించుకుందామని చెప్పారు.

గజ్వేల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని.. పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇప్పిస్తానని ఆయన తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య సూచిక తయారు చేయడమే నా లక్ష్యమని.. రాష్ట్ర ఆరోగ్య సూచిక గజ్వేల్‌ నుంచే ప్రారంభించాలని కోరుతున్ననట్టు ఆయన స్పష్టం చేశారు. అలాగే.. తెలంగాణలో ప్రతి జిల్లాలో.. సాహితీ సౌరభం ఈ మహతి ఆడిటోరియం నిర్మిస్తామన్నారు. కాగా.. గజ్వేల్లో రూ.19.85 కోట్లతో ఆడిటోరియం నిర్మిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.