యాదాద్రిలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేరుకున్నారు. పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

యాదాద్రిలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 13, 2020 | 2:05 PM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేరుకున్నారు. పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీలక్ష్మీనరసింహ స్వామిని ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రికి తీర్థప్రసాదం అందజేసిన అర్చ‌కులు చ‌తుర్వేద ఆశీర్వ‌చనం అందించారు. సీఎం వెంట మంత్రులు జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, విప్ గొంగిడి సునీత‌, ఎంపీ సంతోశ్ కుమార్‌, ఇత‌ర‌ నేత‌లు, అధికారులు పాల్గొన్నారు. యాదాద్రి ఆలయ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకుంది. ఆలయ పనులు ఇప్పటికే తుదిదశకు చేరుకున్నాయి. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న సీఎం కేసీఆర్.. యాదాద్రికి వెళ్లి స్వయంగా పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఆయన ఆదివారం యాదాద్రి పర్యటనకు వచ్చారు. యాదాద్రి ఆల‌య పునరుద్ధ‌ర‌ణ‌ ప‌నులను సీఎం ప‌రిశీలిస్తున్నారు. ఆలయ నిర్మాణ ప‌నుల‌కు సంబంధించి ఆల‌య ఈవో గీత‌, స్థ‌ప‌తి ఆనంద సాయి సీఎం కేసీఆర్‌కు వివ‌రిస్తున్నారు. ప‌నుల పురోగ‌తిపై ఆల‌య అధికారుల‌తో ముఖ్యమంత్రి స‌మీక్ష జ‌ర‌ప‌నున్నారు. ప‌నుల తీరుపై అధికారుల‌కు స‌ల‌హాలు, సూచ‌నలు ఇవ్వ‌నున్నారు.