AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష

కరోనావైరస్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర ఖజానాకి భారీగా గండి పడింది. రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లడంతో రాష్ట్ర ఖజనాకి రావల్సిన పన్నులు బాగా తగ్గిపోయాయి. కేంద్ర నుంచి రావల్సిన పన్నుల్లోనూ కోత పడింది. దీంతో పేదలకు చెల్లించాల్సిన ఫించన్లను యథావిధిగా కొనసాగించి.. ప్రభుత్వ ఉద్యోగుల మే నెల జీతాల్లో కోత విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితిపై ప్రగతి భవన్ లో మంత్రులు, ఉన్నతాధికారులతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష […]

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష
Balaraju Goud
| Edited By: |

Updated on: May 27, 2020 | 9:29 PM

Share

కరోనావైరస్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర ఖజానాకి భారీగా గండి పడింది. రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లడంతో రాష్ట్ర ఖజనాకి రావల్సిన పన్నులు బాగా తగ్గిపోయాయి. కేంద్ర నుంచి రావల్సిన పన్నుల్లోనూ కోత పడింది. దీంతో పేదలకు చెల్లించాల్సిన ఫించన్లను యథావిధిగా కొనసాగించి.. ప్రభుత్వ ఉద్యోగుల మే నెల జీతాల్లో కోత విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితిపై ప్రగతి భవన్ లో మంత్రులు, ఉన్నతాధికారులతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ప్రస్తుత ఆదాయంతో పాటు ఫించన్ల చెల్లింపులు, ఉద్యోగుల వేతనాలపై ఈ సందర్భంగా చర్చించారు. ఈనెల కూడా పేదలకు 12 కిలోల రేషన్ బియ్యాన్ని యథావిదిగా కొనసాగించాలని సీఎం ఆదేశించారు. పింఛనర్లకు మాత్రం మొత్తం పెన్షన్ చెల్లించాలని సీఎం నిర్ణయించారు. ఇక రాష్ట్రానికి నెలకు రూ. 12 వేల కోట్ల మేర ఆదాయం రావాల్సిన ఉండగా.. మే నెలలో కేవలం రూ.3,100 కోట్లు (కేంద్రం నుంచి వచ్చిన వాటాతో కలిపి) మాత్రమే వచ్చాయని అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. లాక్ డౌన్ నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ ఆదాయం పెద్దగా పెరగలేదన్నారు. రాష్ట్రం అప్పులను రీషెడ్యూల్ చేయకపోవడంతో ఏడాదికి దాదాపు రూ. 37,400 కోట్ల మేర వడ్డీ చెల్లించాల్సి వస్తుందని అధికారులు వివరించారు. ఎఫ్ఆర్‌బీఎం పరిమితి పెంచినప్పటికీ, కేంద్రం విధించిన అనేక షరతుల కారణంగా అదనపు రుణాలను సమకూర్చుకునే పరిస్థితిలో లేమని అధికారులు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యోగుల జీతాలు, పింఛన్లు పూర్తిగా చెల్లించినట్లయితే రూ.3 వేల కోట్లకుపైగా అవుతుందని.. ఖజానా ఖాళీ అవుతుందని అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు ప్రతీ కుటుంబానికి నెలకు 1500 రూపాయల నగదు ఇచ్చే కార్యక్రమం మే నెల నిలిపివేయాలని అధికారులు సూచించారు. ఇక ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం,ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోతలను మే నెలలో కూడా కోత కొనసాగుతుంది.

Follow Us
చాణక్య నీతి: భార్య అందంగా ఉంటే భర్తకు ఎందుకు సమస్యలు వస్తాయి?
చాణక్య నీతి: భార్య అందంగా ఉంటే భర్తకు ఎందుకు సమస్యలు వస్తాయి?
ఆయనతో నా బాండింగ్ ఎవరికీ చెప్పలేను.. టాలీవుడ్ నటుడు..
ఆయనతో నా బాండింగ్ ఎవరికీ చెప్పలేను.. టాలీవుడ్ నటుడు..
డైరెక్టర్ కృష్ణ వంశీ, రమ్యకృష్ణ అందమైన ప్రేమకథ గురించి తెలుసా..
డైరెక్టర్ కృష్ణ వంశీ, రమ్యకృష్ణ అందమైన ప్రేమకథ గురించి తెలుసా..
ఆ హీరోతో నటించడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను..
ఆ హీరోతో నటించడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను..
వెనకటి పద్ధతిలో గుమగుమలాడే కోడికూర.. ఇలాచేస్తే గిన్నె లేపాల్సిందే
వెనకటి పద్ధతిలో గుమగుమలాడే కోడికూర.. ఇలాచేస్తే గిన్నె లేపాల్సిందే
స్వాతంత్య్రం వచ్చిన 79 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి బస్సు..
స్వాతంత్య్రం వచ్చిన 79 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి బస్సు..
ఆయన పెద్ద హీరో.. నాకు యాక్సిడెంట్ జరిగిందని తెలిసి ఏం చేశారంటే..
ఆయన పెద్ద హీరో.. నాకు యాక్సిడెంట్ జరిగిందని తెలిసి ఏం చేశారంటే..
మరణం తర్వాత ఆత్మకు ఏమవుతుంది? గరుడ పురాణం, భగవద్గీత ఏం..
మరణం తర్వాత ఆత్మకు ఏమవుతుంది? గరుడ పురాణం, భగవద్గీత ఏం..
మేడికో ప్రియాంక మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..
మేడికో ప్రియాంక మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..
పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్