నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలి .. అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి జగన్‌ 

తుఫాన్ ప్రభావంతో ఏపీ లో పలు చోట్ల వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.  వర్షాల కారణంగా భారీగా పంట నష్టం వాటిల్లింది...

  • Rajeev Rayala
  • Publish Date - 7:18 am, Sun, 29 November 20
నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలి .. అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి జగన్‌ 

తుఫాన్ ప్రభావంతో ఏపీ లో పలు చోట్ల వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.  వర్షాల కారణంగా భారీగా పంట నష్టం వాటిల్లింది. వరదల కారణంగా నష్టపోయిన వారి పట్ల మానవత్వంతో వ్యవహరించాలని, ప్రతి రైతును ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నివర్‌ తుపాన్‌ ప్రభావంతో దెబ్బతిన్న చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో శనివారం సీఎం జగన్ ఏరియల్‌ సర్వే నిర్వహించారు.

గన్నవరం నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న సీఎం.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఏరియల్‌ సర్వే ద్వారా తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావంతో చిత్తూరు జిల్లాలో ఆరుగురు, కడప జిల్లాలో ఇద్దరు మృతి చెందారని.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే అందించాలని అధికారులను  జగన్ ఆదేశించారు.