
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారి విశాఖకు చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఉత్తరాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైకాపా నేతలు జగన్‌కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి జగన్ ప్రత్యేక కాన్వాయ్ లో శారదాపీఠానికి చేరుకున్నారు. అక్కడ స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.