‘ఆరోగ్య శ్రీ’తో ప్రజలకు సీఎం వరాల జల్లు

| Edited By:

Jan 03, 2020 | 12:49 PM

నవరత్న పథకాల్లో భాగంగా మరో స్కీమ్‌ని ప్రారంభించారు సీఎం జగన్‌. పైలెట్‌ ప్రాజెక్టుగా చేపడుతున్న ఆరోగ్య శ్రీ పథకాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు నుంచి మొదలు పెట్టారు జగన్. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కొత్తగా ఆరోగ్య శ్రీలో వెయ్యి సేవలను చేర్చుతూ ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైద్య సేవలను విస్తరించనున్నారు. ఈ సందర్భంగా.. స్థానికంగా అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో జగన్ […]

ఆరోగ్య శ్రీతో ప్రజలకు సీఎం వరాల జల్లు
Follow us on

నవరత్న పథకాల్లో భాగంగా మరో స్కీమ్‌ని ప్రారంభించారు సీఎం జగన్‌. పైలెట్‌ ప్రాజెక్టుగా చేపడుతున్న ఆరోగ్య శ్రీ పథకాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు నుంచి మొదలు పెట్టారు జగన్. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కొత్తగా ఆరోగ్య శ్రీలో వెయ్యి సేవలను చేర్చుతూ ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైద్య సేవలను విస్తరించనున్నారు. ఈ సందర్భంగా.. స్థానికంగా అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో జగన్ కంటి పరీక్ష చేసుకున్నారు.

జగన్ కీలక పాయింట్స్:

1) ఇక నుంచి ఆరోగ్య శ్రీ ద్వారా 2059 వైద్య సేవలు అందుబాటులోకి
2) క్యాన్సర్‌కు కూడా ఆరోగ్య శ్రీని ఉపయోగించుకోవచ్చు
3) వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపు
4) రాష్ట్ర వ్యాప్తంగా కోటీ 42 లక్షల ఆరోగ్య శ్రీ కార్డులు ఇవ్వనున్నాం
5) చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా, వడదెబ్బకు కూడా ఆరోగ్య శ్రీ వర్తింపు
6) వైద్య రికార్డులన్నీ భద్రపరిచేలా కొత్తగా క్యూఆర్ కార్డులు ఇస్తాం
7) ఆనాడు వైద్య రంగంలోనే వైఎస్ ఒక విప్లవానికి నాంది పలికారు
8) ఇప్పుడు దానికన్నా రెండు అడుగులు ముందుకు వేస్తున్నాం
9) 300 ఇళ్లకు ఒక ఆశావర్కర్ ఉంటారు
10) గ్రామ సచివాలయాలతో ఆశావర్కర్లు అనుసంధానం ఉంటుంది
11) విశ్రాంతి సమయంలోనూ రోగులకు రూ.5 వేల ఆర్థిక సాయం
12) ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో 510 రకాల మందులు అందుబాటులో ఉంటాయి
13) డయాలసిస్ చేయించుకునే వారికి రూ.10 వేల పెన్షన్
14) అలాగే పక్షవాతంతో బాధపడే వారికి రూ.5 వేల పెన్షన్
15) ప్రభుత్వ ఆస్పత్రులన్నీ మూడేళ్లలో దశల వారీగా మార్పు