ఆయుర్వేదంతో కరోనాకు చెక్.. క్లినికల్ ట్రయల్స్ లో సత్పలితాలు..!

కరోనా వైరస్‌ మహమ్మారిని తరిమేందుకు ఆయుర్వేద విధానం దివ్య ఔషధంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు.

ఆయుర్వేదంతో కరోనాకు చెక్.. క్లినికల్ ట్రయల్స్ లో సత్పలితాలు..!
Follow us
Balaraju Goud

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 28, 2020 | 7:19 PM

కరోనా వైరస్‌ మహమ్మారిని తరిమేందుకు ఆయుర్వేద విధానం దివ్య ఔషధంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇదే అంశం మరోసారి రుజువైందన్నారు. తాజాగా ఆయుర్వేద విధానంలో ఔషధాన్ని కనుగొనేందుకు చేపట్టిన క్లినికల్‌ ట్రయల్స్‌లో సంచలనాత్మక ఫలితాలు వెలువడినట్టు సమాచారం. శాస్త్రీయ విధానంలో కంటే ఆయుర్వేద పద్ధతిలో చికిత్స పొందుతున్న రోగులు కొవిడ్-19 నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిపిన అధ్యయన ఫలితాల్లో ఈ విషయం వెల్లడైంది. క్లినికల్‌ ట్రయల్స్‌ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా అనుమతి పొందిన అనంతరం.. ఇమ్మ్యునో ఫ్రీ, రెజిమ్యూన్‌లకు సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ను దేశంలోని మూడు ఆస్పత్రుల్లో నిర్వహించారు. శ్రీకాకుళంలోని గవర్నమెంట్‌ మెడికల్‌ హాస్పిటల్‌, గుజరాత్‌, వడోదరా లోని పారుల్‌ సేవాశ్రమ్‌ ఆస్పత్రి, మహారాష్ట్ర, పుణెలో లోక్‌మాన్య ఆస్పత్రిలో ఈ క్లినికల్‌ పరీక్షలు జరిగాయని తెలిపింది.

కోరివల్‌ లైఫ్‌ సైన్సెస్‌కు చెందిన ఇమ్మ్యునో ఫ్రీ, బయోజెటికాకు చెందిన రెజిమ్యూన్‌ అనే ఆయుర్వేద ఔషధాలు కొవిడ్‌ చికిత్సలో చక్కగా పనిచేస్తున్నట్టు సమాచారం. ఈ ఔషధాలను ఉపయోగించి ఆయుర్వేద విధానంలో చికిత్స పొందిన రోగుల్లో 86.66 శాతం మందికి ఐదవ రోజున కరోనా నెగిటివ్‌గా నిర్థారణ అయ్యినట్లు వెల్లడైంది. కాగా, సంప్రదాయ విధానంలో ఇది కేవలం 60 శాతంగా మాత్రమే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక చికిత్స ఆరంభించిన పది రోజుల తర్వాత గానీ కరోనా నెగిటివ్‌గా వచ్చినట్టు తెలిసింది. సంప్రదాయ విధానంతో పోలిస్తే.. ఈ సహజ చికిత్సా విధానం సీ రిక్రియేటివ్‌ ప్రోటీన్‌, డి డైమర్‌, ఆర్‌టీ పీసీఆర్‌ తదితర పరీక్షల్లో కూడా 20 నుంచి 60 శాతం మెరుగైన ఫలితాలు సాధించిందని కోరివల్‌ లైఫ్‌ సైన్సెస్‌ పేర్కొంది.