Pushpa Villain : పుష్ప సినిమా విలన్ విషయంలో తీవ్ర గందరగోళం నెలకుంది. తొలుత తమిళ హీరో బన్నీ కోసం విలన్‌గా మారుతున్నాడని చెప్పారు. ఆ తర్వాత కాదు..కాదు హిందీ యాక్టర్ అని ప్రచారం చేశారు. మళ్లీ తమిళ హీరోనే అని సర్కులేట్ చేశారు. ఇలా రోజుకో కొత్త రూమర్ వైరల్ అవతూ ఉండటంతో ఫ్యాన్స్ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అయితే ఈ విషయంలో మీ కోసం ఓ ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్ తీసుకొచ్చాం. అవును.. ఈ సినిమాకు ఇంకా విలన్‌ను ఫిక్స్ కాలేదు. ప్రజెంట్ విలన్‌గా చేస్తున్నట్టు ప్రచారంలో ఉన్న పేర్లన్ని రూమర్సే అని కార్లిటీ వచ్చేసింది.
పుష్పలో ఆర్య విలన్‌గా ఫిక్స్ అన్న వార్త తెగ వైరల్ అవుతోంది. అయితే అవన్నీ రూమర్స్ అని కొట్టి పారేస్తున్నారు యూనిట్. ఇంకా విలన్ ఎవరన్నది ఫిక్స్ కాలేదు. అయ్యాక మేమే చెప్తాం అని ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. మరి ఇప్పటికైనా రూమర్స్‌కు చెక్ పడుతుందేమో చూడాలి. జనవరి 8 నుంచి మరోసారి మారేడుమిల్లిలో పుష్ప షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ షెడ్యూల్‌లో బన్నీ, రష్మికతో పాటు లీడ్ యాక్టర్స్ అంతా ఉంటారు. 25 రోజులు వారి మకాం అక్కడే. నెక్ట్స్ షెడ్యూల్‌లో విలన్ సీన్స్‌ను ప్లాన్ చేస్తున్నారు సుకుమార్. అందుకే త్వరలోనే విలన్ విషయంలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. పుష్పలో విలన్‌ది యంగ్ అండ్ స్టైలిష్ పోలీస్ క్యారెక్టర్. అందుకే అలాంటి ఫీచర్స్ ఉన్న ఆర్టిస్ట్ కోసం వెతుకుతున్నారు మేకర్స్. ఫిబ్రవరి ఎండ్ నుంచి హీరో, విలన్ కాంబినేషన్‌లో షూట్ స్టార్ట్ చేస్తారు.
Also Read :