అఫ్ఘనిస్థాన్ వీధులు మరోసారి రక్తమోడాయి. సోమవారం మధ్యాహ్నం జరిగిన రాకెట్ల దాడిలో పదుల సంఖ్యలో పౌరులు ప్రాణాలొదిలారని స్థానిక మీడియా సంస్థ టోలో న్యూస్ వెల్లడించింది. మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రుల పాలైనట్లు వెల్లడించింది.
దక్షిణ హెల్మాండ్ ప్రావిన్స్ సంగిన్ జిల్లాలోని పశువుల మార్కెట్లో ఈ రాకెట్ల దాడి జరిగింది. వివిధ జిల్లాల నుండి వందలాది మంది గ్రామస్తులు గొర్రెలు, మేకలను క్రయ విక్రయాలు చేస్తుంటారు. ఈ మార్కెట్ ను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు హెల్మండ్‌లో రాకెట్ల దాడిని అధికారులు ధృవీకరించారు. అదే ప్రావిన్స్‌లోని వాషర్ జిల్లాలో ఆదివారం రోడ్‌సైడ్ బాంబు పేలుడు ధాటికి ఆరుగురు పౌరులు చనిపోయారు.