AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: చట్నీస్‌ రెస్టారెంట్‌లో భారీ పేలుడు.. ముగ్గురికి తీవ్ర గాయాలు..!

హైదరాబాద్ మహానగరంలోని ప్రముఖ రెస్టారెంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఎల్బీనగర్‌లోని చట్నీస్‌ రెస్టారెంట్‌లో పేలుడు జరిగింది. శుక్రవారం (ఫిబ్రవరి 20) ఉదయం రెస్టారెంట్ ఇడ్లీ స్టీమర్ ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో భయాందోళనలకు గురైన సిబ్బంది, కస్టమర్లు బయటకు పరుగులు తీశారు.

Hyderabad: చట్నీస్‌ రెస్టారెంట్‌లో భారీ పేలుడు.. ముగ్గురికి తీవ్ర గాయాలు..!
Chutneys Restaurant In Hyderabad
Balaraju Goud
|

Updated on: Feb 20, 2026 | 3:48 PM

Share

హైదరాబాద్ మహానగరంలోని ప్రముఖ రెస్టారెంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఎల్బీనగర్‌లోని చట్నీస్‌ రెస్టారెంట్‌లో పేలుడు జరిగింది. శుక్రవారం (ఫిబ్రవరి 20) మధ్యాహ్నం రెస్టారెంట్ ఇడ్లీ స్టీమర్ ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో భయాందోళనలకు గురైన సిబ్బంది, కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. పేలుడు శబ్దానికి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ పేలుడు ఘటనలో ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హుటాహుటీన సమీపంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

సుమారు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ కోర్టు పక్కన ఉన్న చట్నీస్ హోటల్ కిచెన్‌లో ఇడ్లీ తయారు చేసే స్టీమర్ పేలిపోయింది. ఇందులో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఎన్టీఆర్ నగర్‌లోని ఆద్య ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారందరూ ప్రమాదం నుండి బయటపడ్డారు. వారు చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ వారందరూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవారని రెస్టారెంట్ యాజమాన్యం తెలిపింది..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us