చిరు 152 మూవీలో నక్సలైట్‌గా చరణ్.. నిజమేనా.?

|

Feb 11, 2020 | 1:35 PM

Chiru 152 Movie Update: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ స్పెషల్ రోల్‌లో కనిపించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దాదాపు 40 నిముషాలు నిడివి కలిగిన ఈ పాత్ర ఆద్యంతం ఆసక్తి కలిగించే విధంగా ఉంటుందని ఫిల్మ్‌నగర్ టాక్. ఇక తాజాగా ఆ పాత్రకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట్లో లీకయ్యింది. చరణ్ ఇందులో నక్స‌లైట్‌గా […]

చిరు 152 మూవీలో నక్సలైట్‌గా చరణ్.. నిజమేనా.?
Follow us on

Chiru 152 Movie Update: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ స్పెషల్ రోల్‌లో కనిపించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దాదాపు 40 నిముషాలు నిడివి కలిగిన ఈ పాత్ర ఆద్యంతం ఆసక్తి కలిగించే విధంగా ఉంటుందని ఫిల్మ్‌నగర్ టాక్. ఇక తాజాగా ఆ పాత్రకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట్లో లీకయ్యింది.

చరణ్ ఇందులో నక్స‌లైట్‌గా కనిపిస్తాడని టాక్. దీనికోసం చెర్రీ 30 రోజుల కాల్షీట్స్ ఇచ్చారని తెలుస్తోంది. దేవాదాయశాఖ భూముల కుంభకోణం నేపథ్యంలో పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కే ఈ సినిమాలో చిరంజీవి ఎండోమెంట్ ఆఫీసర్‌గా కనిపిస్తారు. కామ్రేడ్ తరహా పాత్రలో కనిపించనున్న చరణ్‌కు జతగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ‘ఆచార్య’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కాగా, ఈ మూవీ గురించి పూర్తి వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే వెల్లడించనుంది.