ఆలయాలపై దాడుల నేపథ్యంలో శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారి ఏపీ పర్యటన షురూ.. ఈ నెల 28 వరకు 5 జిల్లాల్లో యాత్ర

|

Jan 17, 2021 | 10:20 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై వరుస దాడుల నేపథ్యంలో శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి ఆంధ్ర రాష్ట్ర పర్యటన షురూ అయింది...

ఆలయాలపై దాడుల నేపథ్యంలో శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారి ఏపీ పర్యటన షురూ.. ఈ నెల 28 వరకు 5 జిల్లాల్లో యాత్ర
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై వరుస దాడుల నేపథ్యంలో శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి ఆంధ్ర రాష్ట్ర పర్యటన షురూ అయింది. ఈ రోజు (17వ తేదీ) నుంచి కర్నూల్ జిల్లా మంత్రాలయం నుండి స్వామి వారి యాత్ర ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఏపీలో ధ్వంసం చేసిన, పాడైన, దెబ్బతిన్న ఆలయాల పరిశీలన చేయనున్నారు చిన్న జీయర్ స్వామి.మంత్రాలయం వగరూరు నుంచి ప్రారంభం కానున్న చిన్న జీయర్ స్వామి పర్యటన, ఈ నెల 28 వరకు 12 రోజుల పాటు 5 జిల్లాల్లో సాగుతుంది. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఆలయ సందర్శన చేస్తారు జీయర్ స్వామి. తన పర్యటలో ఆలయ నిర్వాహకులు, స్థానిక ప్రజలతో సభలు సమావేశాలు నిర్వహించనున్నారు.